దేశంలోని 146 జిల్లాల్లో కరోనా కారణంగా పరిస్థితి దారుణం

దేశంలోని 146 జిల్లాల్లో కరోనా కారణంగా పరిస్థితి చాలా దారుణంగా ఉందని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఇక్కడ పాజిటివిటి రేటు 15 శాతం కంటే ఎక్కువ ఉందని పేర్కొంది..

దేశంలోని 146 జిల్లాల్లో కరోనా కారణంగా పరిస్థితి దారుణం

Covid Positivit

covid positivity rate in india  : దేశంలోని 146 జిల్లాల్లో కరోనా కారణంగా పరిస్థితి చాలా దారుణంగా ఉందని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఇక్కడ పాజిటివిటి రేటు 15 శాతం కంటే ఎక్కువ ఉందని పేర్కొంది. అలాగే 274 జిల్లాల్లో 5 నుండి 15 శాతం మధ్య పాజిటివిటీ రేట్లు ఉన్నాయి.. 308 జిల్లాలు 5 శాతం కన్నా తక్కువ ఉన్నాయి. కరోనా కేసులు పెరిగిన రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ బృందం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ప్రభుత్వం తెలిపింది. వీటిలో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.

ఈసారి 52 శాతం మంది రోగులు 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 48 శాతం మంది రోగులు 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారు ఉన్నారని.. ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. 2.97శాతం మంది రోగులు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు, 8.50శాతం మంది రోగులు 10 నుండి 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు, 20 నుండి 30 సంవత్సరాల వయస్సు గల వారిలో 19.35 శాతం, 30 నుండి 40 సంవత్సరాల వయస్సు గల వారిలో 21.15 శాతం మంది, 40 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వారిలో 17.50 శాతం మందికి కరోనా సోకినట్లు గుర్తించామన్నారు.