Indian Origin CEOs: అనేక టెక్ కంపెనీలకు భారత సంతతి సీఈవోలు

ప్రపంచంలో అనేక టెక్ కంపెనీలకు భారత సంతతి సీఈవోలుగా ఉన్నారు. యూట్యూబ్ సీఈవోగా తాజాగా నీల్ మోహన్ నియమితుడైన విషయం తెలిసిందే. యూట్యూబ్‌ సీఈవో పదవికి సూసన్ వోజిస్కీ రాజీనామా చేయడంతో నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవోగా నియమితుడు అయ్యారు. భారతీయుల్లో ప్రతిభకు కొదవలేదు. ప్రపంచాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న టెక్ కంపెనీలకు మనవారే సీఈవోలుగా ఉన్నారు. వారిలో కొందరిని గురించి చూద్దాం..

Indian Origin CEOs: అనేక టెక్ కంపెనీలకు భారత సంతతి సీఈవోలు

Indian Origin CEOs

Indian Origin CEOs: ప్రపంచంలో అనేక టెక్ కంపెనీలకు భారత సంతతి సీఈవోలుగా ఉన్నారు. యూట్యూబ్ సీఈవోగా తాజాగా నీల్ మోహన్ నియమితుడైన విషయం తెలిసిందే. యూట్యూబ్‌ సీఈవో పదవికి సూసన్ వోజిస్కీ రాజీనామా చేయడంతో నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవోగా నియమితుడు అయ్యారు. భారతీయుల్లో ప్రతిభకు కొదవలేదు. ప్రపంచాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న టెక్ కంపెనీలకు మనవారే సీఈవోలుగా ఉన్నారు. వారిలో కొందరిని గురించి చూద్దాం..

సుందర్ పిచాయ్, 2015 ఆగస్టు 10 నుంచి గూగుల్ సీఈవో అయ్యారు. 2019 నుంచి ఆల్ఫాబెట్ సీఈవోగానూ బాధ్యతలు స్వీకరించారు. సత్య నాదెళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితుడయ్యారు. 2021 నుంచి మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గానూ కొనసాగుతున్నారు. అరవింద్ కృష్ణ 2020 నుంచి ఐబీఎం సీఈవోగా ఉంటున్నారు. 2021 నుంచి ఆ కంపెనీ చైర్మన్ గానూ బాధ్యతలు స్వీకరించారు.

శాంతను నారాయణ్ 2007 నుంచి అడోబ్ సీఈవోగా నియమితుడయ్యారు. 2017 నుంచి ఆ కంపెనీ చైర్మన్ గానూ బాధ్యతలు స్వీకరించారు. అంజలీ సూద్ 2021 నుంచి “వీమీవో” సీఈవోగా బాధ్యతల్లో ఉన్నారు. థామస్ కురియన్ 2019 నుంచి గూగుల్ క్లౌడ్ సీఈవోగా కొనసాగుతున్నాయి. దేవికా బుల్చందనీ.. ఒగిల్వీ సీఈవోగా, జార్జ్ కురియన్.. నెట్ యాప్ సీఈవోగా, రఘు రఘురామ్.. వీఎంవేర్ సీఈవోగా ఉన్నారు.

దిగ్గజ కంపెనీలకు ‘మన’ సీఈవోలు