మారుతీ వాగనార్.. 6 డోర్లు.. 6సీట్లు: ట్రై చేస్తారా..

మారుతీ వాగనార్.. 6 డోర్లు.. 6సీట్లు: ట్రై చేస్తారా..

Maruti WagonR: ఇండియాలో పాపులర్ ఛాయీస్‌గా మారిన ఫోర్ వీలర్ మారుతీ సుజుకీ వాగనార్. ఏళ్ల తరబడి మార్కెట్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది. ఇండియాలోనే కాదు పాకిస్తాన్‌లో కూడా. ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మాడిఫై చేసి మరీ దీనిని వాడుతున్నారు. మధ్యలో కట్ చేసి ఎక్స్ టెండ్ చేయడంతో 4 డోర్లు కాస్తా.. 6డోర్లు అయ్యాయి.

నార్మల్ గా 7సీటర్ వెహికల్స్ కు ఉండే మాదిరి కాకుండా డోర్లు కూడా పెంచడంతో సీటింగ్ కు అసలేం ఇబ్బంది లేకుండాపోయింది. ప్రపంచంలోనే ఇలాంటి మోడల్ ఇదొక్కటే ఉంటుండొచ్చు. బయట వైపు మాడిఫికేషన్స్ చాలా తక్కువగా చేశారు. కార్ లోపలి భాగంలో మాత్రం ఎదురెదురుగా సీట్లను అరేంజ్ చేసి కొత్త లుక్ ఇచ్చారు.

అలా చేయడం వల్ల క్యాబిన్ స్పేస్ కూడా పెరిగి విలాసంగా కూర్చొనేలా కనిపిస్తుంది. అంతేకాకుండా డ్యాష్ బోర్డ్ కూడా మార్చారు. మ్యూజిక్ సిస్టమ్ తో అరేంజ్‌మెంట్స్ అదిరిపోయాయి. రూ.12లక్షలతో 660సీసీ ఉండే వాగనార్‌ ఇంజిన్‌కు అదనంగా మార్పులు చేసి ఉండొచ్చని చెప్తున్నారు.

ఇండియాలోనూ తక్కువేం కాదు.. ఇటువంటివి చాలానే చూస్తుంటాం. సాధారణంగా ఇటువంటి వాటిని పెళ్లిళ్లకు, లేదా స్పెషల్ ఈవెంట్లకు అద్దెకు ఇస్తుంటారు. మాడిఫై చేసిన కొన్ని కార్లలో మినీ ఫ్రిడ్జ్, బార్, పర్సనల్ ఇన్‌ఫోంటైన్మెంట్ సిస్టమ్, రిక్లైనర్స్, టీవీ, యాంబియంట్ లైటింగ్ వంటి ఏర్పాట్లు చేస్తుంటారు. వీటిలో కొన్నింటికి లీగల్ పర్మిషన్లు కూడా ఉన్నాయి.

ఇండియాలో మాత్రం మాడిఫై చేసిన వాహనాలను బ్యాన్ చేసింది సుప్రీం కోర్టు. వాహనం షేప్‌లో కానీ, ఇతర వాహనాల ఇంజిన్ వాడటం కానీ చేయకూడదు. ఇటువంటి ప్రయోగాలు చేసిన వాహనాలను గతంలో కొన్ని సార్లు సీజ్ చేశారు పోలీసులు.

WagonR-6-sea-2

WagonR-6-sea-2