ఏకంగా మినిష్టర్ కారుతో రేస్ పెట్టుకున్న టూరిస్టులు

ఏకంగా మినిష్టర్ కారుతో రేస్ పెట్టుకున్న టూరిస్టులు

minister car chase

Overtaking Union Minister’s car: ఏకంగా మినిష్టర్ కారుతోనే రేసింగు పెట్టుకున్నారు టూరిస్టులు. గెలిచిందెవరో అనే ప్రశ్న పక్కకుబెడితే చేజ్ చేసి ముందుకొచ్చిన కార్లను పోలీసులు పట్టుకుని స్టేషన్ కు పంపించారు. ఇదంతా జరిగింది ఒడిశాలో.. రాష్ట్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేయాలని ప్రయత్నించారు. సంతోష్ షా, అతని భార్య, సోదరుడితో పాటు ఇద్దరు మైనర్లతో కోల్ కతాకు బాలాసోర్ లోని పంచలింగేశ్వర్ నుంచి రిటర్న్ అయ్యారు. వెనుక సైరన్ విని అంబులెన్స్ అనుకుని తాను తప్పుకున్నట్లు సంతోష్ చెప్తున్నాడు.

వారిని క్రాస్ చేసి వెళ్లిపోయిన తర్వాత అది మినిష్టర్ కాన్వాయ్ అని వారికి తెలిసింది. దాంతో పాటు ఓ పైలట్ కార్ కూడా ఉంది. కొద్ది సేపు డ్రైవింగ్ చేశాక మినిష్టర్ కార్ వెళ్లిపోయిందనుకునే తాము ఓవర్ టేక్ చేశామని అతను చెప్తున్నాడు. దాదాపు ఆ కార్ జలేశ్వర్ లోని లఖనాథ్ టోల్ గేట్ వరకూ 20కిలోమీటర్ల పాటు చేజ్ చేసింది.

వెస్ట్ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో దొరికిన కార్లను అదుపులోకి తీసుకుని బాస్తా పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వాహనదారులను ఓ ఐదుగంటల పాటు స్టేషన్ లో ఉంచారు. మరోసారి రిపీట్ చేయమని.. క్షమాపణ కోరుతూ సంతకం పెట్టాకే వారిని విడుదల చేశారు. ‘రెండు వాహనాలు ఓవర్ టేక్ చేసిన తర్వాత మంత్రి వాళ్లను పట్టుకుని వెనక్కు తీసుకురావాలని ఆదేశించారు. వారిని పట్టుకుని మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. తర్వాత పీఆర్ మీద వారిని రిలీజ్ చేశారు. మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ కాకూడదని వార్నింగ్ ఇచ్చారు.

West_Bengal_Tourist_detained

West_Bengal_Tourist_detained


ఇండియాలో దాదాపు మినిష్టర్ ల ప్రయాణానికి కచ్చితంగా కాన్వాయ్ ఉంటుంది. వారి ప్రయాణం సేఫ్ గా, వేగంగా జరగాలని వాటికి అనుమతులు ఇస్తారు. వాటిని ఓవర్ టేక్ చేయడం చాలా అరుదు. ఏదైనా వాహనం వీఐపీ కాన్వాయ్ కు దగ్గరగా వస్తుంటే.. సెక్యూరిటీ కార్లు దానిని అడ్డుకుంటాయి. ఒడిశాలో జరిగిన ఘటనలో అలా జరగలేదు.

దీనిపై కారు నడిపే వ్యక్తి షా మాట్లాడుతూ.. ఇండియాలో మినిష్టర్ కార్లకు సైరన్ తో పాటు ఫ్లాషర్ నిషేదించారు. కానీ,మంత్రి కారుకు అవి ఉన్నాయి. ప్రధానమంత్రి కారుకు కూడా సైరన్, ఫ్లాష్ లైట్ లాంటివి ఉండవు. మరి అది మంత్రి కారుకు ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నాడు. పోలీసులు షాపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. కేసు బుక్ చేశామంటున్నారు. సెక్షన్ల గురించి స్పష్టత ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.