Viral video: మెడాగాస్కర్ దేశానికి 15,000 సైకిళ్ళు అందించిన భారత్.. సైకిల్ తొక్కిన మెడాగాస్కర్ అధ్యక్షుడు

భారత 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెడాగాస్కర్ దేశానికి భారత్ 15,000 సైకిళ్ళను విరాళంగా ఇచ్చింది. మెడాగాస్కర్ లోని భారత రాయబారి అభయ్ కుమార్ ఈ సైకిళ్ళను ఆ దేశానికి అందించారు. మెడాగాస్కర్ ప్రధానమంత్రి క్రిస్టియన్ లూయిస్ ఎన్ట్సే కు ఆ సైకిళ్ళను అందించిన తర్వాత అక్కడి అధికారులు వాటిపై కాసేపు తిరిగారు.

Viral video: మెడాగాస్కర్ దేశానికి 15,000 సైకిళ్ళు అందించిన భారత్.. సైకిల్ తొక్కిన మెడాగాస్కర్ అధ్యక్షుడు

Independence Day-2022

Viral video: భారత 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెడాగాస్కర్ దేశానికి భారత్ 15,000 సైకిళ్ళను విరాళంగా ఇచ్చింది. మెడాగాస్కర్ లోని భారత రాయబారి అభయ్ కుమార్ ఈ సైకిళ్ళను ఆ దేశానికి అందించారు. మెడాగాస్కర్ ప్రధానమంత్రి క్రిస్టియన్ లూయిస్ ఎన్ట్సే కు ఆ సైకిళ్ళను అందించిన తర్వాత అక్కడి అధికారులు వాటిపై కాసేపు తిరిగారు.

క్రిస్టియన్ లూయిస్ ఎన్ట్సే, అభయ్ కుమార్ కూడా ఆ సైకిళ్ళు తొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియోను అభయ్ కుమార్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మెడాగాస్కర్, భారత్ మధ్య స్నేహ బంధాన్ని ఇది సూచిస్తోందని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న సయన్వయం, సహకారానికి కూడా ఇది చిహ్నమని అన్నారు. మరోవైపు, మెడాగాస్కర్ రాజధాని అంటాననారివోలో అభయ్ కుమార్ భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఆఫ్రికా దేశమైన మెడాగాస్కర్ జనాభా రెండున్నర కోట్లు.