పశ్చిమబెంగాల్‌లో రూపాయి తగ్గిన పెట్రోల్ ధర

పశ్చిమబెంగాల్‌లో రూపాయి తగ్గిన పెట్రోల్ ధర

West Bengal Fuel Rate: వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా పెట్రోల్ పై రూపాయి ధర తగ్గించేసింది. రాష్ట్ర ప్రభుత్వం విధించే ట్యాక్స్ లో పెట్రోల్, డీజిల్ పై రూపాయి చొప్పిన తగ్గించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ఆదివారం అర్ధరాత్రి నుంచే ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు.

పెరిగిన ధరలకు నిరసన వ్యక్తం చేస్తుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘కేంద్రం పెట్రోల్ ధరలు పెంచి ఒక్క లీటరుపై రూ.32.90 సొమ్మును ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.18.46మాత్రమే వస్తుంది. డీజిల్ పై లీటరుకు రూ.31.80 వస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.12.77మాత్రమే తీసుకుంటుందని అన్నారు.

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ.. రాష్ట్రాలతో విభేదిస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపణలు గుప్పించారు.