Russia Ukraine war: అన్ని సాధనాలూ వాడతామన్న పుతిన్.. అణ్వాయుధాలు వాడతారని తాము అనుకోవట్లేదన్న జెలెన్ స్కీ

పుతిన్ ఆ పని చేయకుండా ప్రపంచ దేశాలు నియంత్రిస్తాయన్న నమ్మకం తమకు ఉందని జెలెన్ స్కీ అన్నారు. పుతిన్ ఇస్తున్న వార్నింగులపై ఆయన స్పందిస్తూ.. ‘ఉక్రెయిన్ తో పాటు పోలాండ్ కూడా తమకు కావాలని లేదంటే అణ్వాస్త్రాలను వాడతామని కూడా రేపు పుతిన్ అనవచ్చు’ అని అన్నారు. తమ భూభాగాల విషయంలో రాజీపడబోమని చెప్పారు. రష్యా సైనికుల్లో క్రమశిక్షణ, నైతికత, విశ్వాసం లేకపోవడం వల్లే పాక్షిక సైనిక సమీకరణ చేయాలని పుతిన్ నిర్ణయం తీసుకున్నారని జెలెన్ స్కీ అన్నారు.

Russia Ukraine war: అన్ని సాధనాలూ వాడతామన్న పుతిన్.. అణ్వాయుధాలు వాడతారని తాము అనుకోవట్లేదన్న జెలెన్ స్కీ

Russia Ukraine war

Russia Ukraine war: రష్యా తన భూభాగాలను కాపాడుకునే విషయంలో అన్ని సాధనాలనూ వాడే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. దీంతో రష్యా అణ్వాయుధాలను వాడనుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, అమెరికా, మిత్రదేశాల సాయంతో యుక్రెయిన్ భీకరంగా పోరాడుతుండడంతో రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్న పలు ప్రాంతాలను ఇప్పటికే యుక్రెయిన్ తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకుంది. రష్యా అధ్యక్షుడు తాజాగా చేసిన వ్యాఖ్యలపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. తాజాగా ఆయన జెర్మన్ మీడియాతో మాట్లాడుతూ… పుతిన్ అణ్వాయుధాలను వాడతారని తాము అనుకోవడం లేదని చెప్పారు. పుతిన్ ఆ పని చేయకుండా ప్రపంచ దేశాలు నియంత్రిస్తాయన్న నమ్మకం తమకు ఉందని అన్నారు.

పుతిన్ ఇస్తున్న వార్నింగులపై ఆయన స్పందిస్తూ.. ‘ఉక్రెయిన్ తో పాటు పోలాండ్ కూడా తమకు కావాలని లేదంటే అణ్వాస్త్రాలను వాడతామని కూడా రేపు పుతిన్ అనవచ్చు’ అని అన్నారు. తమ భూభాగాల విషయంలో రాజీపడబోమని చెప్పారు. రష్యా సైనికుల్లో క్రమశిక్షణ, నైతికత, విశ్వాసం లేకపోవడం వల్లే పాక్షిక సైనిక సమీకరణ చేయాలని పుతిన్ నిర్ణయం తీసుకున్నారని జెలెన్ స్కీ అన్నారు.

Muslim devotee donates Rs 1 cr: తిరుమల శ్రీవారికి ముస్లిం భక్తుడు రూ.కోటి విరాళం