Georgia : బెడ్ కింద 18 పాములు. అది చూసి కేకలు వేసిన మహిళ

గుడ్లు పెట్టె జీవులు ఒకే దగ్గర అన్ని గుడ్లను పేర్చి పొదుగుతాయి. పాము కూడా అంతే ఒకే దగ్గర గుడ్లు పెట్టి పొదుగుతుంది. దీంతో పిల్లలు కుప్పలు తెప్పలుగా పుడతాయి. పాము జాతిని బట్టి 10 నుంచి 120 పిల్లల వరకు చేస్తాయి. అయితే ఇవి ఎక్కడో అడవిలో పిల్లలు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. జనావాసాల మధ్యకాని, ఇంట్లో కానీ పిల్లలు చేస్తే చూసినవారు భయపడిపోతారు.

Georgia : బెడ్ కింద 18 పాములు. అది చూసి కేకలు వేసిన మహిళ

Georgia

Georgia : గుడ్లు పెట్టె జీవులు ఒకే దగ్గర అన్ని గుడ్లను పేర్చి పొదుగుతాయి. పాము కూడా అంతే ఒకే దగ్గర గుడ్లు పెట్టి పొదుగుతుంది. దీంతో పిల్లలు కుప్పలు తెప్పలుగా పుడతాయి. పాము జాతిని బట్టి 10 నుంచి 120 పిల్లల వరకు చేస్తాయి. అయితే ఇవి ఎక్కడో అడవిలో పిల్లలు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. జనావాసాల మధ్యకాని, ఇంట్లో కానీ పిల్లలు చేస్తే చూసినవారు భయపడిపోతారు.

అయితే పాములు ఇంట్లోని బండల కింద, ఇంటి పైకప్పులో పిల్లలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా ఓ పాము బెడ్ కింద పిల్లలు చేసింది. ఈ సంఘటన జార్జియాలో చోటుచేసుకుంది. ట్రిస్ విల్చర్ అనే మహిళ రాత్రి సమయంలో తన బెడ్ రూమ్ లో నిద్ర పోవడానికి బెడ్ ను సర్దుతున్న సమయంలో నేలపై ఏదో శబ్ధం వినిపించడంతో దగ్గరగా వెళ్లి చూసింది.

ఆ మహిళకు పాము కనిపించడంతో ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది.. వెంటనే ఆమె భర్త రూమ్ లోపలకి వచ్చి పాము పిల్లను చూసాడు. వెంటనే దానిని బయటకు తీసేందుకు ప్రయాణించాడు. ఇదే సమయంలో మరికొన్ని పాములు కంటపడ్డాయి. బెడ్ ని తీసి చూడగా మొత్తం 18 పాము పిల్లలు కనిపించాయి. వీటిని ఓ సంచిలో వేసి సమీపంలోని అడవిలో వదిలేశారు.