న్యూజిలాండ్ లో కొత్త కరోనా కేసులు..మళ్లీ అలా వచ్చాయి..

  • Published By: nagamani ,Published On : June 16, 2020 / 09:10 AM IST
న్యూజిలాండ్ లో  కొత్త కరోనా కేసులు..మళ్లీ అలా వచ్చాయి..

కరోనాను కట్టడి చేసిన దేశంగా న్యూజిలాండ్ సంతోషం వ్యక్తం చేసింది. కానీ వదల బొమ్మాళీ నిన్ను అన్నట్లుగా న్యూజిలాండ్ లో కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ దేశాలన్నీ కరోనాను కట్టడి చేసేందుకు పడరాని పాట్లు పడుతుంటే అతి తక్కువ సమయంలోనే ప్రజలను చైతన్యపరుస్తూ తగిన జాగ్రత్తలుతీసుకుంటూ కరోనాకు కళ్లెం వేసింది న్యూజిలాండ్. 

అగ్రదేశాలకుకూడా సాధ్యం కానిదాన్ని సాధ్యం చేసిన న్యూజిలాండ్ అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచింది. కానీ దేశంలో నమోదైన చిట్టచివరి కరోనా వైరస్‌ బాధిత మహిళ కూడా కోలుకుందని ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ స్వయంగా ప్రకటన చేసిన వారం రోజులకే న్యూజిలాండ్ లో కొత్తగా రెండు కరోనా కేసులు వెలుగులోకి రావటంతో మరోసారి దేశం ఉలిక్కిపడింది. దేశంలో ఉండే కరోనాను సమర్థవంతంగా తరిమికొట్టిన న్యూజిలాండ్ విదేశాల నుంచి వస్తూనే వారి వల్ల వచ్చే కేసులతో మరోసారి కరోనా మహమ్మారి కోరల్లో పడింది.

బ్రిట‌న్ నుంచి న్యూజిలాండ్ కు వచ్చిన ఇద్ద‌రికి క‌రోనా ఉన్నట్లుగా డాక్టర్లు నిర్థారించారు. అలా 24 రోజుల తరువాత న్యూజిలాండ్ లో మళ్లీ తొలిసారి వైర‌స్ కేసులు నమోదయ్యాయి. న్యూజిలాండ్ లో చనిపోయిన ఉన్న తమ తల్లిదండ్రుల అంత్యక్రియల కోసం వారువచ్చారు. అప్పటికే వీరి కోసం వారి తల్లిదండ్రుల అంత్యక్రియలను వాయిదా వేశారు. కాబట్టి వారిని కరోనా నిబంధనల మేరకు క్వారంటైన్ సెంటర్ కు పంపించకుండానే వారిని వదిలివేయాల్సి వచ్చిందనీ..వారి వల్లనే మరోసారి కరోనా వైరస్ వచ్చిందని..దీంతో కరోనా కేసులు మరోసారి నమోదయ్యాయనీ   డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు. వారితో ఎవరెవరిని కలిసారు అనేదానిపై అధికారులు  ఆరా తీస్తున్నారు. వారిని గుర్తించి పరీక్షలు చేస్తామని తెలిపారు.

వారి పరిస్థితిని బట్టి ఎయిర్ పోర్ట్ నుంచేక్వారంటైన్ సెంటర్ కు పంపించకుండా వదిలేయటం.. దీంతో వాళ్లు కారులో వెల్లింగ్టన్ కు చేరుకున్నారు. కానీ వారి ప్రయాణంలో ఎవ్వర్నీ కలవలేదు. కానీ వారు ప్రయాణించిన విమానం ఆవల్లే మరోసారి దేశంలో కరోనా వచ్చినట్లుగా తెలుస్తోంది. 

వారం రోజుల క్రితం న్యూజిలాండ్‌ లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తేసింది. భ‌విష్య‌త్తులో తమ దేశంలో కొత్తగా క‌రోనా కేసులు మ‌ళ్లీ న‌మోదయ్యే అవ‌కాశాలున్నాయని, జాగ్రత్తగా ఉండాలని  జెసిండా ప్రజలను హెచ్చరించిన క్రమంలో మరోసారి కేసులు నమోదుకావటంపై ఆ దేశ యత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టింది.