Brain Eating Amoeba : మెదడును తినేసే అమీబా..! మరో వ్యక్తి మృతి..ప్రపంచానికి మరో కొత్త వైరస్ ఆందోళన

మెదడును తినే అమీబా బారిన పడి మరో వ్యక్తి మృతి చెందాడు. ఈ భయంకరమైన వైరస్ తో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవటంతో ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. దీంతో ప్రపంచానికి మరో కొత్త వైరస్ ఆందోళన మొదలైంది.

Brain Eating Amoeba : మెదడును తినేసే అమీబా..! మరో వ్యక్తి మృతి..ప్రపంచానికి మరో కొత్త వైరస్ ఆందోళన

Brain Eating Amoeba

Brain Eating Amoeba : ఇప్పటికే ప్రపంచం పలు రకాల వైరస్ లతో హడలిపోతోంది. దీనికి తోడు మరో కొత్తరకం ప్రపంచాన్ని భయపెడుతోంది. అదే ‘మెదడును తినే అమీబా’ (brain-eating amoeba) చెరువులు, నదుల్లో ఈత కొట్టినప్పుడు నీటి ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించి ఆ పై బ్రెయిన్ ను తినేస్తుంది. ఈ వైరస్ (అమీబా) బారినపడి ఓ వ్యక్తి మరణించాడు. అతని ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆపై ఆ వైరస్ మెదడుకి చేరుకుని మెదడులోని కణాలను కొంచెం కొంచెంగా తినేసి ప్రాణాప్రాయాన్ని కలుగజేస్తుంది. అటువంటి వైరస్ (అమీబా)బారిన పడిన దక్షిణ కొరియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి మరణించాడు. దీంతో ‘మెదడును తినే అమీబా’బారిన పడి మరో  మరణం నమోదు అయ్యింది.

ఇలా మనిషి మెదడుని కొంచెం కొంచెంగా తినేసి ప్రాణాలు తీసేస్తుంది. అందుకే ఈ వైరస్ ను ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ అంటారు. దీన్ని ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) అని పిలుస్తారు. ఈ ఇన్ఫెక్షన్ ‘నేగ్లేరియా ఫౌలెరి’ అని పిలువబడే వెచ్చని మంచినీటిలో కనిపించే మైక్రోస్కోపిక్ సింగిల్ సెల్డ్ అమీబా వల్ల వస్తుంది. 1937లో మొదటిసారిగా అమెరికాలో ఒక వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డాడు. అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం లేక్ జాక్సన్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డాడు. దీంతో లేక్ జాక్సన్ ప్రాంత ప్రజలు కుళాయి నీళ్లు వాడొద్దు అంటూ అధికారులు హెచ్చరించారు. మెదడును తినివేసే నేగ్లెరియా ఫోలరీ అనే ప్రాణాంతక సూక్ష్మజీవులతో ఈ నీరు కలుషితమైందనే అనుమానాలతో అధికారులు ఆ ప్రాంతవాసులు కుళాయిల నీటిని వాడొద్దంటూ సూచించారు. వేలాదిమంది ప్రజలు నివసించే లేక్ జాన్సన్ ప్రాంతంలో కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీరు ‘నేగ్లెరియా ఫోలరీ’ అనే ఒక రకం అమీబాతో కలుషితమై ఉండొచ్చని అనుమానించారు అధికారుల. ఈ అమీబాతో కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లి మెదడులోకి ప్రవేశించి మెదడు కణాలను తినేస్తూ ప్రాణాంతకంగా మారుతాయి. అమెరికాలో ఈ రకం అమీబా సోకడం అరుదే. 2009, 2018 మధ్య కాలంలో ఇలాంటివి 34 కేసులు గుర్తించారు.

ఇదిలా ఉంటే మొదటిసారిగా..దక్షిణ కొరియాకు చెందిన వ్యక్తి మెదడును తినే అమీబా అనే అరుదైన వ్యాధిని కలిగి ఉన్నాడని నిపుణులు గుర్తించారు. సదరు బాధితుడు నాలుగు నెలలుగా ఆగ్నేయాసియా దేశాల్లో ఒకటైన థాయ్ లాండ్ వెళ్లి 10న తన స్వగ్రామానికి వచ్చాడు ఓ 50 ఏళ్ల వ్యక్తి. ఆ తరువాత అతను అనారోగ్యానికి గురి అయ్యాడు. దీంతో అతను తలనొప్పి, జ్వరం, వాంతులు, మాటలు అస్పష్టంగా రావటం, మెడ గట్టిపడి విపరీతమైన నొప్పి వంటి లక్షనాలతో ఆసుపత్రిలో చేరాడు. ఈ లక్షణాలు వింతగా అనిపించటంతో డాక్టర్లు అతనికి పలు రకాల టెస్టులు చేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చి వైద్యం అందించారు. ఈక్రమంలో 21వ తేదీన అతను మరణించాడు.

మెదడును తినే అమీబా అనే అరుదైన వ్యాధితో మరణించినట్లు దక్షిణ కొరియా వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రం ప్రకటించింది. నేగ్లేరియా ఫౌలెరి అనేది ప్రపంచవ్యాప్తంగా వెచ్చని మంచినీటి సరస్సులు, నదులు, కాలువలు,చెరువులలో సాధారణంగా కనిపించే అమీబా. ఇది మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే అది మెదడులోకి చేరుకుని మెదడు కణాలను తినేటయం మొదలుపెడుతుంది. అలా ఆ మనిషి ప్రాణాల్ని తీసేస్తుంది. ఈ మెదడు తినేసి అమీబా విషయంలో కొరియన్ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఈ ఇన్ఫెక్షన్ మనిషి నుండి మనిషికి సంక్రమించే అవకాశం చాలా తక్కువ. అదే సమయంలో..బాధిత వ్యక్తి (వైరస్ సంక్రమించిన వ్యక్తి) ఏ నీటి వనరుల్లో అయినా స్నానం చేస్తే అది ఈ నీటినుంచి మరొరకరికి సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి సదరు బాధితుడు నివసించిన ప్రాంతంలోని నీటి వనరులలో స్నానాలు చేయకూడదని ప్రజలకు సూచించారు.

2018 నాటికి అమెరికా, ఇండియా, థాయ్‌లాండ్‌తో సహా దేశాల్లో 381 మంది మెదడును తినే అరుదైన అమీబా బారిన పడ్డారు. అమెరికాలో ఇప్పటివరకు 151 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిలో నలుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ముఖ్యంగా, మెదడు తినే అమీబా బారిన పడిన వారిలో 97% మంది మరణిస్తున్నారు. ఈ వ్యాధికి సమర్థవంతమైన చికిత్స లేదా టీకా ఇంకా కనిపెట్టలేదు.