Grandma Love Story : ఆమెకు 61, అతడికి 24… ఆ ఇద్దరు ప్రేమలో పడ్డారు

ప్రేమ‌ గుడ్డిది అంటారు. హద్దులు లేవు అంటారు. అంతేనా.. ప్రేమకు కులం, మతం అడ్డు కాదంటారు. అంతేకాదు వ‌య‌సుతోనూ సంబంధం లేదని చాలాసార్లు రుజువైంది. తాజాగా మ‌రోసారి వీళ్లు రుజువు చేశారు. వాళ్లే.. 61 ఏళ్ల బామ్మ‌, 24 ఏళ్ల యువ‌కుడు. అమెరికాకు చెందిన ఈ ప్రేమజంట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

Grandma Love Story : ఆమెకు 61, అతడికి 24… ఆ ఇద్దరు ప్రేమలో పడ్డారు

Grandma Love Story

Grandma Love Story : ప్రేమ‌ గుడ్డిది అంటారు. హద్దులు లేవు అంటారు. అంతేనా.. ప్రేమకు కులం, మతం అడ్డు కాదంటారు. అంతేకాదు వ‌య‌సుతోనూ సంబంధం లేదని చాలాసార్లు రుజువైంది. తాజాగా మ‌రోసారి వీళ్లు రుజువు చేశారు. వాళ్లే.. 61 ఏళ్ల బామ్మ‌, 24 ఏళ్ల యువ‌కుడు. అమెరికాకు చెందిన ఈ ప్రేమజంట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

బామ్మ పేరు చెరిల్‌. వయసు 61 సంవ‌త్స‌రాలు. ఆమెకు 17మంది మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్లు ఉన్నారు. రామాక్రిష్ణ అంటూ కాలం గడిపేయాల్సిన వయసు. మనువళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసు. అయిన‌ప్ప‌టికీ.. ఈ వ‌య‌సులో ఓ తోడు కావాల‌నుకుంది. అంతే.. ఓ యువ‌కుడి ప్రేమ‌లో ప‌డింది. ప్రియుడి పేరు మెక్ కెయిన్. అత‌డికి 24 సంవత్సరాలు. కెయిన్ కి 15 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే.. చెరిల్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ట‌. కాక‌పోతే.. అప్పుడు వాళ్ల మ‌ధ్య ప్రేమ చిగురించ‌ లేదు. ఆ త‌ర్వాత వాళ్ల‌లో ప్రేమ మొద‌లైంది.

ఇద్ద‌రూ క‌లిసి.. టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ ఉండేవార‌ట‌. టైమ్‌పాస్ కోసం కెయిన్.. చెరిల్‌ తో ఎక్క‌వ స‌మ‌యం గ‌డిపేవాడు. చెరిల్‌ను త‌న కుటుంబ స‌భ్యుల కంటే ఎక్కువ‌గా కెయిన్ చూసుకునేవాడు. త‌న కేరింగ్ న‌చ్చి.. చెరిల్ అత‌డి ప్రేమ‌లో ప‌డిపోయింది.

ఇప్పుడు ఇద్ద‌రూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇద్ద‌రూ క‌లిసే ఉంటున్నారు. వాళ్ల ప్రేమ‌కు ఇరు కుటుంబాలు కూడా అడ్డు చెప్ప‌లేదు. దీంతో.. ఇద్ద‌రూ ఒక్క‌టైపోయారు. ఇద్దరి మ‌ధ్య 37 సంవ‌త్స‌రాల గ్యాప్ ఉన్న‌ప్ప‌టికీ.. అవేమీ ప‌ట్టించుకోకుండా.. త‌మ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడీ జంట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.