Ukrainian Soldier : హీరోస్ ఆఫ్ యుక్రెయిన్.. ఏకంగా ఆరు రష్యా ఫైటర్‌ జెట్లను కూల్చాడు

రష్యా వంటి పెద్ద దేశం తమపై దురాక్రమణకు తెగించగా, చిన్న దేశమైన యుక్రెయిన్ ఒంటరిగానే పోరాడుతోంది. ప్రాణత్యాగాలకు కూడా యుక్రెయిన్ సైనికులు వెనుకాడడంలేదు.

Ukrainian Soldier : హీరోస్ ఆఫ్ యుక్రెయిన్.. ఏకంగా ఆరు రష్యా ఫైటర్‌ జెట్లను కూల్చాడు

Ukraine Soldier

Russian military planes : రెండోరోజు యుద్ధంలో యుక్రెయిన్‌కు చెందిన ఓ సైనికుడు హీరోగా నిలిచాడు. రయ్యిమని దూసుకువస్తున్న రష్యా ఎయిర్‌క్రాఫ్ట్‌లను వరుసగా నేలకూల్చాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు రష్యా ఫైటర్‌ జెట్ల పని పట్టాడు. చక్ నోరిస్ అనే సైనికుడు.. కీవ్‌పై అటాక్ చేసేందుకు వచ్చినవారికి చుక్కలు చూపించాడు. ది ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలవబడే యుక్రెయిన్ జెట్ ద్వారా… రష్యా సైనిక విమానాలను కూల్చివేశాడు. 30 గంటల పాటు నిర్విరామంగా యుద్ధ విమానం నడిపిన ఆ పైలట్‌… ఇపుడు యుక్రెయిన్‌కు హీరోగా మారిపోయాడు.

రష్యా దండయాత్రను ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ వాసులు మేము సైతం అంటూ కదనరంగంలోకి దూకుతున్నారు. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు సైనిక పాత్ర పోషిస్తుండగా.. అతడిని చూసి స్పూర్తిపొందిన మరికొందరు నాయకులు సైతం యుద్ధభూమిలో పోరుబాటకు రెడీ అవుతున్నారు. తాజాగా యుక్రెయిన్‌ మహిళా ఎంపీ కూడా తుపాకీ చేతపట్టుకుని పోరాడానికి రెడీ అయ్యారు. చట్ట సభల్లో వాయిస్ వినిపించడమే కాదు.. అవసరమైతే ఆయుధం చేతపట్టి పోరాడటం తెలుసని నిరూపిస్తున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా పోరాడుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Ukraine Russia War : మరింత భీకరంగా వార్.. కీవ్, ఖర్కిన్ లోకి ప్రవేశించిన రష్యా బలగాలు

రష్యా వంటి పెద్ద దేశం తమపై దురాక్రమణకు తెగించగా, చిన్న దేశమైన యుక్రెయిన్ ఒంటరిగానే పోరాడుతోంది. ప్రాణత్యాగాలకు కూడా యుక్రెయిన్ సైనికులు వెనుకాడడంలేదు. నల్ల సముద్రంలో యుక్రెయిన్ సైనికుల వీరోచిత పోరాటం ఆ దేశ సైన్యానికి మరింత ధైర్యాన్ని తెచ్చింది. యుక్రెయిన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా సైన్యం.. స్నేక్ ఐలాండ్‌లోని యుక్రెయిన్ మిలిటరీ కేంద్రంపైనా దృష్టి సారించింది. నల్ల సముద్రంలో ఓ రష్యా యుద్ధ నౌక స్నేక్ ఐలాండ్ సమీపంలో మోహరించింది.

దీవిలో ఉన్న యుక్రెయిన్ సైనికులను గుర్తించింది. వెంటనే ఇది రష్యాకు చెందిన సైనిక యుద్ధనౌక అని.. మీరు మీ ఆయుధాలను కిందపడేసి లొంగిపోవాలని.. లేకపోతే మీపై బాంబుల వర్షం కురిపిస్తామని రష్యా అధికారి స్పష్టం చేశాడు.అయితే, అవతలివైపు నుంచి ఏమాత్రం లెక్కని చేయని రీతిలో దీటైన సమాధానం వచ్చింది. రష్యా యుద్ధ నౌకా అయితే ఏంటి? అని యుక్రెయిన్ సైనికుడు ఘాటుగా బదులిచ్చాడు.

UN Security Council : రష్యాకు వ్యతిరేకంగా ఐరాసా భద్రతా మండలిలో తీర్మానం.. వీగిపోయిన తీర్మానం

ఆ తర్వాత రష్యా యుద్ధనౌక నిప్పుల వర్షం కురిపించగా, స్నేక్ ఐలాండ్ లో ఉన్న యుక్రెయిన్ సైనికులు 13 మందీ వీరమరణం పొందారు. దీనిపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భావోద్వేగభరితంగా స్పందించారు. స్నేక్ ఐలాండ్ లో తమ సైనికులు ధైర్యంగా మృత్యువును ఆహ్వానించారే తప్ప ఓటమిని అంగీకరించలేదన్నారు. వారికి మరణానంతర హీరో ఆఫ్ యుక్రెయిన్ పురస్కారాలు అందజేస్తామని జెలెన్ స్కీ వెల్లడించారు.