Cyclone Hits Brazil: బ్రెజిల్‌ను తాకిన తుపాన్..11మంది మృతి, 20 మంది అదృశ్యం

బ్రెజిల్ దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్‌లో ఉష్ణమండల తుపాన్ కారణంగా 11 మంది మరణించారు. మరో 20 మంది అదృశ్యమయ్యారు.....

Cyclone Hits Brazil: బ్రెజిల్‌ను తాకిన తుపాన్..11మంది మృతి, 20 మంది అదృశ్యం

బ్రెజిల్ ను తాకిన తుపాన్...భారీవర్షాలు

Updated On : June 18, 2023 / 12:08 PM IST

Cyclone Hits Brazil 11 Killed, 20 Missing: బ్రెజిల్ దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్‌లో ఉష్ణమండల తుపాన్ కారణంగా 11 మంది మరణించారు. (Cyclone Hits Brazil)కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వరదలు వెల్లువెత్తాయ. పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోవడంతో మరో 20 మంది తప్పిపోయారు.(11 Killed, 20 Missing) తప్పిపోయిన వారిని కనుగొనడానికి వరద ప్రాంతాల్లో హెలికాప్టర్ సాయంతో అధికారులు గాలిస్తున్నారు.

Ram Charan : ఆగస్టు వరకు నో షూటింగ్స్ అంటున్న చరణ్.. ఏదైనా ఉపాసన డెలివరీ అయ్యాకే..

కారా పట్టణంలో వరదల వల్ల 8వేల మంది నిరాశ్రయులయ్యారు. తూర్పు తీరంలోని మునిసిపాలిటీ అయిన మాక్విన్‌లో ఒక అడుగు వర్షం కురిసింది.కారా నగరంలో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆ ప్రాంతాన్ని సందర్శించిన రియో గ్రాండే డో సుల్ గవర్నర్ ఎడ్వర్డో లైట్ అన్నారు. గత రెండు రోజుల్లో 2,400 మందిని రక్షించామని గవర్నర్ చెప్పారు.

North India Extreme Heatwave: ఉత్తర భారతంలో వీస్తున్న వేడిగాలులు..98 మంది మృతి

బ్రెజిల్‌ దేశంలో తరచూ తలెత్తే వరదలు దశాబ్దాలుగా వినాశనానికి కారణమయ్యాయి.వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడం, తప్పిపోయిన వ్యక్తుల జాడను కనుగొని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి యత్నిస్తున్నామని బ్రెజిల్ అధికారులు చెప్పారు.