US General: ‘ఏలియన్స్ విషయాన్ని కొట్టిపారేయలేం’.. గగనతలంలో అనుమానాస్పద వస్తువులపై అమెరికా అభిప్రాయం

ఆదివారం కూడా అమెరికా గగనతలంపై మరో అనుమానాస్పద వస్తువు కనిపించింది. అమెరికా-కెనడా సరిహద్దులో లేక్ హురాన్‌పై ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువును ఎఫ్-16 యుద్ధ విమానం పేల్చివేసింది. ఇలా రోజుల వ్యవధిలోనే అమెరికా గగనతలంపై అనుమానాస్పద వస్తువులు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

US General: ‘ఏలియన్స్ విషయాన్ని కొట్టిపారేయలేం’.. గగనతలంలో అనుమానాస్పద వస్తువులపై అమెరికా అభిప్రాయం

US General: ఇటీవలి కాలంలో అమెరికా గగనతలంపై వరుసగా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పది రోజుల క్రితం చైనాకు చెందిన స్పై బెలూన్‌ను అమెరికా పేల్చి వేసింది. ఆ తర్వాత శనివారం కెనడా గగనతలంలో కనిపించిన మరో గుండ్రటి వస్తువును కూడా అమెరికా యుద్ధ విమానాలు పేల్చివేశాయి.

Delhi: తల్లితోపాటు ఫ్యాక్టరీకి వెళ్లిన బాలుడు.. ఎలివేటర్ షాఫ్ట్‌లో చిక్కుకుని మృతి

తాజాగా ఆదివారం కూడా అమెరికా గగనతలంపై మరో అనుమానాస్పద వస్తువు కనిపించింది. అమెరికా-కెనడా సరిహద్దులో లేక్ హురాన్‌పై ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువును ఎఫ్-16 యుద్ధ విమానం పేల్చివేసింది. ఇలా రోజుల వ్యవధిలోనే అమెరికా గగనతలంపై అనుమానాస్పద వస్తువులు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో అమెరికా రక్షణ రంగ నిపుణులు మాట్లాడుతూ ఆ వస్తువులు ఏలియన్స్‌కు సంబంధించినవి అయ్యుండొచ్చనే విషయాన్ని కొట్టిపారేయలేమన్నారు.

WPL Auction 2023: మహిళా ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం.. కోటి దాటే ఆటగాళ్లు వీళ్లేనా?

అమెరికా ఎయిర్‌ఫోర్స్ జనరల్ గ్లెన్ వ్యాన్ హెర్క్ మాట్లాడుతూ ‘‘ఆ వస్తువులు ఏలియెన్స్‌కు సంబంధించినవా.. కాదా అనే విషయాన్ని కొట్టిపారేయలేం. ఈ విషయాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ నిపుణులు కనుక్కుంటారు. ప్రస్తుతం ఉత్తర అమెరికాకు వీటి వల్ల పొంచి ఉన్న ముప్పును అన్ని రకాలుగా అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ వస్తువులు ఎలా, ఎక్కడి నుంచి వస్తున్నాయో మిలిటరీ ఇంకా గుర్తించలేదు. ఇప్పటికైతే వాటిని బెలూన్లుగా పిలవలేం. వస్తువులుగానే చూస్తాం’’ అన్నారు. మరో అమెరికా రక్షణ రంగ అధికారి మాట్లాడుతూ ఇప్పటివరకు లభించిన వస్తువుల్లో గ్రహాంతరవాసులకు సంబంధించిన ఆధారాలేమీ దొరకలేదన్నారు.