Israel Palestine Conflict: ఇజ్రాయెల్ వచ్చి నెతన్యాహూని కలిసిన బైడెన్.. గాజా ఆసుపత్రి మీద దాడిపై ఏమన్నారంటే?

ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడిని ఎయిర్‭పోర్టుకు వెళ్లి మరీ కౌగిలించుకుని స్వాగతం పలికారు నెతన్యాహూ. బైడెన్ పర్యటనలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధానికి పరిష్కారంపై చర్చించనున్నారు.

Israel Palestine Conflict: ఇజ్రాయెల్ వచ్చి నెతన్యాహూని కలిసిన బైడెన్.. గాజా ఆసుపత్రి మీద దాడిపై ఏమన్నారంటే?

Biden meets Netanyahu

Updated On : October 18, 2023 / 4:58 PM IST

Biden meets Netanyahu: హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక్కసారిగా ఇజ్రయెల్‭లో ల్యాండ్ అయ్యారు. వచ్చీ రాగానే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఈ యుద్ధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హమాస్ ప్రజలు మారణహోమానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. హమాస్ పాలస్తీనాకు ప్రాతినిధ్యం వహించదని అంటూనే ఈ పోరాటం ఇజ్రాయెల్‌కు అంత సులభమేమీ కాదని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఆయన ఇజ్రాయెల్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అలాగే హమాస్ పూర్తి పాలస్తీనా బాధ్యత వహించదని బైడెన్ అన్నారు. అయితే గాజా ఆసుపత్రిపై దాడి ఇజ్రాయెల్ కాకుండా మరింకెవరో చేసినట్లు బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇరు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంలో బైడెన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఇక బైడెన్ అనంతరం, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మాట్లాడుతూ.. అమెరికా సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది మానవ నాగరికతకు, ఉగ్రవాదానికి మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడిని ఎయిర్‭పోర్టుకు వెళ్లి మరీ కౌగిలించుకుని స్వాగతం పలికారు నెతన్యాహూ. బైడెన్ పర్యటనలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధానికి పరిష్కారంపై చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి: Telangana BJP – JanaSena : మద్దతు ఇవ్వండి.. పవన్ కల్యాణ్ తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ.. పవన్ ఏం చెప్పారంటే?

గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 500 మంది మరణించారు. దీన్ని బైడెన్ ఖండించారు. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత పెరిగింది. వాస్తవానికి ఈ దాడి ఇజ్రాయెల్ కు ప్రతికూలంగా మారనుంది. ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేస్తున్నామని వాదించిన ఇజ్రాయెల్ కు దీంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా లాంటి దేశాల మద్దతు కోసం చేస్తున్న దౌత్య ప్రయత్నాలకు ఆటంకంగా మారనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో అరబ్ నేతల శిఖరాగ్ర సమావేశం రద్దైంది. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో అరబ్ నేతలతో ఆయన శిఖరాగ్ర సమావేశం నిర్వహించాల్సి ఉంది. వీటి మధ్య టెల్ అవీవ్ కు బైడెన్ చేరుకున్నారు. అయితే ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధానికి పరిష్కారం కనుగొనే సామర్థ్యం బైడెన్ కు లేదని జోర్డాన్ రాజు అంతకు ముందు చెప్పారు.