Covid Vaccine: కోటి 36లక్షల కొవిడ్ డోసులు చెత్త బుట్టలోకి..

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ వేసుకునే వాళ్లు లేక కోటి 36లక్షల డోసులు చెత్త బుట్టలోకి చేరనున్నాయి. 2020లో కెనడా ఆస్ట్రాజెనెకా 2కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు కావాలని ఆర్డర్ పెట్టింది. వీటిలో 23లక్షల మంది మార్చి నుంచి జూన్ వరకూ ఒక్క డోస్ మాత్రమే తీసుకున్నారు.

Covid Vaccine: కోటి 36లక్షల కొవిడ్ డోసులు చెత్త బుట్టలోకి..

Vaccine 11zon

 

 

Covid Vaccine: ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ వేసుకునే వాళ్లు లేక కోటి 36లక్షల డోసులు చెత్త బుట్టలోకి చేరనున్నాయి. 2020లో కెనడా ఆస్ట్రాజెనెకా 2కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు కావాలని ఆర్డర్ పెట్టింది. వీటిలో 23లక్షల మంది మార్చి నుంచి జూన్ వరకూ ఒక్క డోస్ మాత్రమే తీసుకున్నారు.

ఆస్ట్రాజెనెకా నుంచి రక్తం గడ్డకట్టడం గురించి 2021 వంటి సమస్యలు వచ్చాయి. దీంతో కెనడా Pfizer-BioNTech, Moderna నుండి mRNA వ్యాక్సిన్‌ల పుష్కల సరఫరాలను ఉపయోగించడంపై దృష్టి పెట్టింది.

జూలై 2021లో, కెనడా తాము సేకరించిన సరఫరాలో మిగిలిన మొత్తాన్ని దాదాపు 17.7 మిలియన్ డోస్‌లను విరాళంగా ఇస్తానని చెప్పింది. కానీ మంగళవారం ఒక ప్రకటనలో, హెల్త్ కెనడా ఆ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ 13.6 మిలియన్ డోసుల వ్యాలిడిటీ ముగిసిందని చెత్తలో పారేయాల్సిందేనని పేర్కొంది.

Read Also : ఒమిక్రాన్‌పై ఆస్ట్రాజెనెకా బూస్టర్‌ ప్రభావంతం.. కొత్త అధ్యయనం

ప్రపంచ జనాభాలో 61 శాతం మందితో పోల్చితే దాదాపు 85 శాతం మంది కెనడియన్లు పూర్తిగా వ్యాక్సిన్లు వేసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో నివసిస్తున్న వారిలో కేవలం 16 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు.