బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడని..తనను తానే పెళ్లి చేసుకున్న అందాల భామ
బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడని ఓ యువతి తనను తానే వివాహం చేసుకుంది. అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకుని తనను తానే ఆల్ ది బెస్ట్ చెప్పుకుంది.

Australia Woman Marries Herself After Break Up With Boyfriend
Woman marries her self : ప్రేమించుకోవటం, బ్రేకప్ చెప్పుకోవటం ఇటీవల కాలంలో సర్వసాధాణమైపోయింది. కానీ కొంతమంది ప్రేమికులు తిరిగి కలుస్తారు.తమ ప్రేమను పొందుతారు.పెళ్లి చేసుకుంటారు. అలాకాకపోతే వేరొకరిని ప్రేమించటమో లేదా వేరే ఎవరినన్నా పెళ్లి చేసుకోవటమో చేస్తారు. కానీ కొంతమంది మాత్రం తమ ప్రేమించినవారిని మర్చిపోలేక అలాగే ఉండిపోతారు. బ్రేకప్ అయ్యాక కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. కానీ ఓ అమ్మాయి మాత్రం తన బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడని..వేరెవరినో పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది? ఎవ్వరూ ఊహించని విధంగా ‘తనను తానే పెళ్లి’ చేసుకుంది..! బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేక్అప్ అయ్యాక.. ఇంకెవరీ ప్రేమించలేదు.. ఇంకెవరితో రిలేషన్‌షిప్ మెయిన్‌టెన్ చేయలేదు. చివరకు.. తనను తానే పెళ్లి చేసుకుంది…!!
ఆ ప్రేమికురాలి పేరు ‘పాట్రీసియా క్రిస్టినే. వయస్సు 28 ఏళ్లు. టీచర్ గా పనిచేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ చేసుకుంది. కానీ ఇంతలోనే బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడు.దీంతో క్రిస్టినే కృంగిపోయింది. ఆ తరువాత ఎంతోమందితో పరిచయం అయినాగానీ ఎవ్వరినీ ప్రేమించలేదు. అలాగే ఉండిపోయింది. అలా 8 ఏళ్లు గడిచిపోయాయి.
ఎనిమిదేళ్లుగా ఆమె ఒంటరిగానే ఉంది. దీంతో ఫ్రెండ్స్, బంధువులు, తెలిసినవారు అంతా ఏంటీ ఇంకా పెళ్లి చసుకోవా? అడిగేవారు.30 ఏళ్లు నిండకుండా పెళ్లి చేసుకోవాలి..అని చెబుతుండేవారు. వారికి ఏం చెప్పాలో తెలియని సతమతమైపోయేది. తన గురించి తెలిసి కూడా ఇలా అడుగుతుంటం..టార్చర్ గా అనిపించేది. దీంతో ఆమె ఇక లాభం లేదనుకొని.. తనను తానే పెళ్లి చేసుకుంది.
2020 మేలో తననే పెళ్లి చేసుకుంది. తన పెళ్లి కోసం 5000 రూపాయలు ఖర్చుపెట్టింది. అది కూడా తన వెడ్డింగ్ రింగ్, పూలు, వెడ్డింగ్ డ్రెస్ కోసం కేవలం 5000 రూపాయలు ఖర్చు పెట్టి.. తను తన పెళ్లిని జరుపుకుంది. ఓ పార్క్‌లో కేవలం తన 9 మంది బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య తన వివాహాన్ని కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేసుకుంది.
తనకు తానే ఆల్ ది బెస్ట్ చెప్పుకుంది. అయితే.. తనను తానే పెళ్లి చేసుకున్నా క్రిస్టినా భవిష్యత్తులో తనకు నచ్చే వ్యక్తి పరిచయమైతే మాత్రం ఖచ్చితంగా అతడిని పెళ్లి చేసుకుంటానని చెబుతోంది పాట్రీసియా. అప్పటి వరకు మాత్రం.. తన గోల్స్ మీద, తనను తాను ప్రేమించుకోవడం మీద దృష్టి పెడుతుందట.