Mysterious Stone: బంగారం కోసం వెతికితే బండరాయి దొరికింది.. అదేంటో తెలిసి షాక్..

బంగారం కోసం వెతికతున్న ఓ వ్యక్తి ఓ పేద్ద బండరాయి దొరికింది.. అదేంటో తెలీదు. కానీ దాన్ని పట్టుకెళ్లి ఇంట్లో దాచాడు. కొన్నాళ్లకు అదేంటో తెలిసి షాక్ అయ్యాడు.

10TV Telugu News

Mysterious Stone : ‘నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అగును’ అనేమాట విన్నారా? అంటే..తల కిందకు పెట్టుకుని పడుకోవటానికి కూడా పనికిరాదని పారేసిన రాయి ఇల్లు కట్టుకోవటానికి అదే మూల రాయి అవుతుంది అని. అంటే మనకు పనికిరాదని పారేసిన రాయే మనకు ఎప్పటికైనా పనికొస్తుంది అని. అదే జరిగింది అస్ట్రేలియాలో ఓ వ్యక్తికి. బంగారం కోసం వెదికితే అతనికి ఓ పేద్ద బండరాయి దొరికింది. ఇదేంటిరా బాబూ బంగారం మాట ఎలా ఉన్నా..ఈ బండరాయిని ఏం చేసుకోవాలి? అని విసుక్కుంటు ఓ పక్క బంగారం దొరకలేదనే బాధ..మరోపక్క బండరాయి దొరికిందనే చిరాకు..నిరాశా నిస్పృహలతో విసగిపోయాడు. ఇక బంగారం కోసం వెతకటం మానేశాడు.కానీ అదే బండరాయి తన పాలిట భాంఢాగారం అవుతుందని అస్సలు ఊహించలేదు..ఆ బండరావు విలువేంటో తెలుసుకుని షాక్ అయ్యాడు.

Read more : Whale Vomit: తిమింగ‌లం వాంతి రూ.10 కోట్లు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు!

ఆస్ట్రేలియాలో నివసించే డేవిడ్ హోల్.. బంగారం కోసం వెతుకుతున్నప్పుడు ఒక వింత రాయి కంటపడింది. దాన్ని చూసి ఇదేదో భలేగా ఉందే అనుకున్నాడు. కానీ బంగారం దొరకలేదనే నిరాశతో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అలాగని దాన్ని పారేయలేుద. ఇంటికి తీసుకెళ్లాడు. ఓ మూల పారేశాడు. కానీ ఆ రాయి 4.6 బిలియన్ సంవత్సరాల నాటి అరుదైన ఉల్క అని తెలిసి షాక్ అయ్యాడు. డేవిడ్ హోల్ 2015లో మెల్బోర్న్ సమీపంలోని మేరీబరో రీజినల్ పార్క్‌లో బంగారం కోసం వెతకడానికి వెళ్లాడు. రీజినల్ పార్క్‌ 19వ శతాబ్దంలో బంగారు ‘గని’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ బంగారం కోసం వెతుకుంటుంటారు. అక్కడ బంగారం ఎవరికి దొరికితే వారికే సొంతం. ప్రభుత్వం ఏమీ అభ్యంతర పెట్టదు. అలా ఆ పార్క్ లో వెతుక్కుంటే కొందరికి కొద్దిపాటి బంగారం దొరికిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

Read more : woman finds rare diamond : పార్కులో వాకింగ్ చేస్తుంటే వృద్ధురాలికి దొరికిన అరుదైన వజ్రం

డేవిడ్ హోల్ కూడా బంగారాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అలా అతినికి ఓ బండరాయి దొరికింది. దాన్ని చూసి చిరాకుపడ్డాడు. ఏకంగా 17 కిలోల బరువున్న ఈ రాయి వల్ల నాకేంటి ఉపయోగం అనుకుని చిరాకుపడ్డాడు. కానీ ఆ రాయిలో నగ్గెట్స్ ఉన్నాయనుకున్నాడు. దానిని పగలగొట్టడానికి ప్రయత్నించాడు. కానీ పగల్లేదు. ఇక చిరాకొచ్చి దాన్ని ఆరేళ్లపాటు ఇంట్లోనే దాచి పెట్టి ఉంచాడు. ఆ తరువాత డేవిడ్ దాని గురించి ఆలోచించటం మానేశాడు.

Read more : పన్నా మైన్స్ లో నిరుపేదకు దొరికిన రూ.40లక్షల విలువైన వజ్రం

ఒక రోజు హఠాత్తుగా డేవిడ్‌కు ఆ బండరాయి గుర్తుకొచ్చింది.దీన్ని ఇంతకాలం దాచాను కదా..దీని వల్ల ఏమన్నా ఉపయోగముందేమో అనుకున్నాడు. ఎందుకన్నా పనికి వస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. అలా దాన్ని మెల్‌బోర్న్ మ్యూజియానికి తీసుకెళ్లాడు. అక్కడ నిపుణులు దాన్ని పరిశీలించి అదో ‘ఉల్క’ అని..17 కిలోల బరువుందని..4.6 బిలియన్ సంవత్సరాల నాటి అరుదైన ఉల్క అని చెప్పారు. అది విన్న డేవిడ్ షాక్ అయ్యాడు.

Read more : Chameleon Diamond: రంగులు మారుస్తున్న వజ్రం..సైటిస్టులు సైతం షాక్

దీని గురించి మ్యూజియంలోని జియాలజిస్ట్ డెర్మోట్ హెన్రీ ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ..విక్టోరియాలో కనుగొన్న 17వ ఉల్క ఇది అని చెప్పారు. ఉల్కలు మన సౌర వ్యవస్థ యొక్క వయస్సు, నిర్మాణం మరియు రసాయన శాస్త్రం గురించి ఆధారాలను అందించడంలో సహాయపడతాయని ఆయన చెప్పారు. డేవిడ్ హోల్ తెలియకుండా కనిపెట్టిన ఈ రాయికి అది దొరికిన ప్రదేశం పేరు ‘మేరీబరో’ అని పెట్టారు.