Bangladesh communal violence: దుర్గా పూజ మండపంలో ఖురాన్ పెట్టిన వ్యక్తి ఇతనే

బంగ్లాదేశ్ పోలీసులు ఎట్టకేలకు దుర్గా పూజలో ఖురాన్ పెట్టిన వ్యక్తిని కనుగొన్నారు. కొమిల్లాలోని నానువా దిఘిర్ పర్ పూజా మండపంలో ఈ ఘటనకు పాల్పడటంతో మతాల మధ్య ఘర్షణలకు దారితీసింది.

10TV Telugu News

Bangladesh communal violence: బంగ్లాదేశ్ అల్లర్లకు కారణమైన వ్యక్తిని కనుగొన్నారు. ఎట్టకేలకు దుర్గా పూజ మండపంలో ఖురాన్ పెట్టిన వ్యక్తిని కనుగొన్నారు. కొమిల్లాలోని నానువా దిఘిర్ పర్ పూజా మండపంలో ఈ ఘటనకు పాల్పడటంతో మతాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఢాకా ట్రిబ్యూన్ కు చెందిన ఇఖ్బాల్ హుస్సేన్ (35)గా ఆ వ్యక్తిని గుర్తించారు. అక్టోబర్ 13న అక్కడ ఉంచినట్లుగా వెల్లడించాడు.

పూజా వేదిక వద్ద ఉంచిన వీడియో ఫుటేజిని పోలీసులు విశ్లేషించిన తర్వాత ఆచూకీ తెలిసింది. రాజకీయ పార్టీలతో ఏమైనా సంబంధాలున్నాయా.. అలా చేయడం వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మొత్తంలో 41మందిని అరెస్టు చేయగా.. వారిలో నలుగురు ఇఖ్బాల్ కు సన్నిహితులని తెలిసింది.

హోం మినిష్టర్ అసదుజ్జమన్ ఖాన్ కమల్ మాట్లాడుతూ.. నిందితుడు పరారీలో ఉండి తరచూ లొకేషన్లు మార్చుతూ ఉండటంతో పట్టుకోవడం కాస్త ఇబ్బందిగా మారింది. అతని అరెస్టు తర్వాత కేసును పూర్తిగా పరిశీలిస్తామని వెల్లడించారు.

……………………………….. : క్రైయింగ్‌ రూం…బాధల్లో ఏడ్వచ్చు

బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిగిన ఘటన ఏడుగురి ప్రాణాలను బలిగొంది. మతపరమైన ఘర్షణలు చెలరేగి.. దాదాపు 72 కేసులు నమోదు కాగా 450మంది వరకూ అరెస్టు అయ్యారు. హిందువులకు చెందిన పలువురి ఇళ్లు ధ్వంసం చేశారు. చాలా మందిరాలతోపాటు పూజా వేదికలు సైతం నాశనం అయ్యాయి.

సోషల్ మీడియా ప్రచారం నమ్మి.. ఆవేశానికి లోనుకావొద్దని ప్రధాన మంత్రి షేక్ హసీనా పిలుపునిచ్చారు. ముస్లిం మెజారిటీ ఉన్న బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా 10శాతం.