Taliban : నరికిన తలతో సంబరాలు.. తాలిబన్ల మరో ఆటవిక చర్య

తాలిబన్ల ఆటవిక చర్యలకు అడ్డు లేకుండా పోయింది. రోజురోజుకు వారి దురాఘతాలు పెరిగిపోతున్నాయి. నరరూప రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ అఫ్ఘాన్ సైనికుడి తల నరికిన తాలిబన్లు, దాన్ని

Taliban : నరికిన తలతో సంబరాలు.. తాలిబన్ల మరో ఆటవిక చర్య

Taliban

Taliban : తాలిబన్ల ఆటవిక చర్యలకు అడ్డు లేకుండా పోయింది. రోజురోజుకు వారి దురాఘతాలు పెరిగిపోతున్నాయి. నరరూప రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ అఫ్ఘాన్ సైనికుడి తల నరికిన తాలిబన్లు, దాన్ని పైకెత్తి చూపుతూ సంబరాలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాలిబన్లు సందేశాలు పంపుకునే ప్రైవేట్ చాట్ లో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థ వెల్లడించింది. తల నరికిన తర్వాత తాలిబన్లు తమ నాయకుడు హిబతుల్లా అఖున్ జాదాకు సంబంధించిన నినాదాలు చేశారని తెలిపింది.

Apple : ఐఫోన్-13 విడుదలపై నెట్టింట రచ్చ.. ఆపిల్ మూఢనమ్మకాలను నమ్ముతుందా?

ఈ వీడియో 36 సెకన్ల నిడివి ఉంది. సైనికుడిని ఆరుగురు తాలిబన్లు చుట్టుమాట్టారు. ఎడారిలో కూర్చోపెట్టారు. ఐదుగురు తాలిబన్ల చేతిలో రైఫిల్స్ ఉన్నాయి. మరో తాలిబన్ చేతిలో రెండు కత్తులు ఉన్నాయి. మరో వ్యక్తి దీన్ని వీడియో తీస్తున్నాడు. ఆ తర్వాత సైనికుడి తల నరికేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళ పట్ల క్రూరంగా ప్రవర్తించమని, వారికి రక్షణ కల్పించేలా తమ కొత్త ప్రభుత్వం ఉంటుందని తాలిబన్లు ప్రకటించారు. కానీ, వారి చేతలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

McDonald India మెనూలో కొత్త ఐటమ్స్.. పసుపు పాలు, మసాలా కడక్‌ చాయ్!

కొన్ని రోజుల క్రితం అఫ్ఘానిస్తాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ తమ్ముడు రోహుల్లా సలెహ్‌ని తాలిబన్లు హతమార్చారు. పంజ్‌షీర్‌ వ్యాలీలో రోహుల్లాను గుర్తించిన తాలిబన్లు… అతన్ని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. కాగా, లోయలో తాలిబాన్లకు వ్యతిరేకంగా సలేష్ పోరాటం చేశాడు. అగస్టు 15న తాలిబన్లు కాబుల్ ను ఆక్రమించుకోవడంతో రెసిస్టెన్స్ ఫోర్సెస్(ప్రతిఘటన దళాల) నేత అహ్మద్ మసూద్‌తో కలిసి అమ్రుల్లా సలేహ్ పంజ్ షేర్ లోయకు వెళ్లిపోయారు. అక్కడే అఫ్ఘాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఆయన ప్రకటించుకున్నారు. అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. విధ్వంసకాండను కొనసాగిస్తున్నారు.