Biden Struggling Wear His Jacket : కోటు వేసుకోవడానికి నానా తిప్పలుపడిన జో బైడెన్‌..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోటు వేసుకోవటానికి ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

Biden Struggling Wear His Jacket : కోటు వేసుకోవడానికి నానా తిప్పలుపడిన జో బైడెన్‌..

US President Joe Biden Struggling Wear His Jacket

Biden Struggling Wear His Jacket : పాపం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోటు వేసుకోవటానికి ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. రివ్వున గాలి వీస్తోంది. హెలికాప్టర్ దిగిన తరువాత కోటు వేసుకుందామని యత్నించారు బైడెన్. కానీ రివ్వున వీస్తున్న గాలికి కోటు వేసుకోవటం అంత ఈజీ కాలేదు. దీంతో పక్కనే ఉన్న భార్య సహాయం చేయటంతో పాపం..బైడెన్ ఎట్టకేలకు కోటు వేసుకోగలిగారు. వరద బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పటానికి వెళ్లిన సందర్భంగా బైడెన్ కు ఇటువంటి ఇబ్బంది ఎదురైంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కరోనా వచ్చి రెండు వారాలు హోం క్యారంటైన్‌లో గడిపిన అనంతరం వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లాడు. బాధితులకు ధైర్యం చెప్పడమే కాక పలు వాగ్దానాలు కూడా చేశారు. ఈ ప్రకృతి వైపరిత్యం కుటుంబాలను ఎలా చిద్రం చేస్తోందో తనకు తెలుసని అ‍న్నారు. ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మీరు ఫెడరల్‌ ప్రభుత్వ పాలనలో ఉన్నారు. మీరంతా మీరు ఉన్న చోటు …రాష్ట్రం, కౌంటీ లేదా నగరాలకు చేరుకునేవాళ్లకు అండగా ఏంటామని హామీ ఇచ్చారు.

ఈ పర్యటన తరువాత బైడెన్ దంపతులు తిరిగి వస్తున్న సందర్భంలో కెంటుకీ విమానాశ్రయంలో బైడెన్‌ హెలికాప్టర్‌ దిగి వస్తూ సూట్‌ వేసుకోవడానికి ప్రయత్నిస్తు నానా పాట్లు పడ్డారు. వేగంగా వీస్తున్న గాలివల్ల కోటు ఒక చేయి తొడుక్కున్నాక మరో చేయి తొడుక్కోవటానికి నానా పాట్లు పడ్డారు. దీంతో సహాయం కోసం తన భార్య బిల్‌ బైడెన్‌ వైపు తిరిగితాడు. ఆమె సాయంతో ఎట్టకేలకు కోటు వేసుకోగలిగారు. భర్తకు కోటు వేసుకోవటానికి సహాయం చేస్తుండగా ఆమె నవ్వుతున్నట్లుగా కనిపించారు.

అంతేకాదు బైడెన్ కు కోటు వేసుకోవడంలో సహాయం చేసిన తరువాత జిల్ బైడెన్ కాస్త ముందుకు నడుస్తూ హెయిర్ బ్యాండ్ తీసేవేసే సమయంలో అది కింద పడిపోగా..బైడెన్ దాన్ని వంగి చేత్తో తీసినట్లుగా ఉందీ వీడియోలో..ఈ సమయంలో బైడెన్ అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా కాకుండా ఓ సాధారణ భర్తలాగా అనిపించారు.