Bikini Air hostess : బికినీలు ధరించే ఎయిర్ హోస్టెస్‌లు .. ఆ ఎయిర్ లైన్స్ స్పెషల్ అదే

బికినీలు ధరించే ఎయిర్ హోస్టెస్‌లు .. ఆ ఎయిర్ లైన్స్ స్పెషల్ అదే.

Bikini Air hostess : బికినీలు ధరించే ఎయిర్ హోస్టెస్‌లు .. ఆ ఎయిర్ లైన్స్ స్పెషల్ అదే

Bikini Airline vietjet

Bikini Airline vietjet : ఎయిర్ హోస్టెస్ లు అంటే చూడముచ్చటగా ఉంటారు.చక్కటి డ్రెస్ ఆకర్షించే రూపంతో ఉంటారు. ఫిష్ కట్ మిడీతో నమ్రతగా ప్రయాణీకులతో మర్యాదగా..వినమ్రంగా ఉంటారు. కానీ ఓ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ లు మాత్రం ఫుల్ డిఫరెంట్. హాట్ హాట్ గా కనిపిస్తారు. ఇతర ఎయిర్ లైన్స్ లో లా కాదు ‘బికినీ’లతో హాట్ హాట్ గా కనిపిస్తారు. ప్రయాణీకులను వారి డ్యాన్స్ లతోను..వయ్యారాలతోను అలరిస్తుంటారు. బికినీలు ధరించిన ఎయిర్ హోస్టెస్ లు ఆ ఎయిర్ లైన్స్ కు స్పెషల్ స్పెషల్ ఎట్రాక్షన్.. బికినీలు ధరించిన ఎయిర్ హోస్టెస్ లవల్లే నష్టాల్లో ఉండే ఆ ఎయిర్‌లైన్ సంస్థ లాభాల బాట పట్టింది. ఆ వింత ఎయిర్ లెన్స్ ‘వియత్‌జెట్’..!

బికినీ ఎయిర్‌లైన్ పేరుతో వియట్‌జెట్ విమానయాన సంస్థ 2011 సంవత్సరంలో వియత్నాంలో మొదటిసారిగా అరంగేట్రం చేసింది. చాలా కొద్ది కాలంలోనే ఇది చాలా ప్రజాదరణ పొందిన విమానయాన సంస్థగా మారింది. దీంతో వియట్ జెట్ లాభాల బాటలో నడుస్తోంది. ఈ ఎయిర్ లైన్స్ లో పనిచేసే మహిళలు బికినీల్లో విధులు నిర్వహిస్తుంటారు.ఎయిర్ హోస్టెస్ యొక్క ఈ దుస్తుల కారణంగా ఈ విమానయాన సంస్థ వివాదాస్పదమైంది కూడా. వివాదం అయితే ఏమి..లాభాలు వచ్చి పడ్డాయిగా..

ఎయిర్ హోస్టెస్‌ బికినీల్లో దర్శనిమిస్తే ఎలా ఉంటుంది? అని ఆ సంస్థ యజమానికి వచ్చిన ఆలోచనే ఆ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టాయి. యజమాని చెప్పారో లేదో ఎయిర్ హోస్టెస్ అంతా బికినీల్లో ప్రయాణికులను అలరించి నష్టాల్లో ఉన్న సంస్థను భారీ లాభాల్లోకి తీసుకొచ్చారు.

వియత్‌జెట్ .. వివరాల్లోకి వెళితే.. వియత్నాంకు చెందిన వియతజెట్‌ అనే ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించే ఎయిర్‌హోస్టెస్‌లు బికినీ లేదా షర్టు- షార్ట్స్‌లో హాజరుకావొచ్చని ఆ సంస్థ యజమాని ఎమ్‌ఎస్‌ థావో సెలవిచ్చారు. అయితే అది బీచ్‌లకు వెళ్లే విమానాల్లోని ఎయిర్‌ హోస్టెస్‌లకు మాత్రమే. దీంతో వారు మాత్రం టూపీస్‌ దుస్తుల్లోనే దర్శనమిస్తున్నారన్నమాట. దీనివల్ల కస్టమర్లు అనూహ్యంగా పెరుగుతున్నారని వారి ఆలోచన.

గతంలో 2011లో ఈ ఎయిర్‌లైన్స్‌ యజమాని ఏకంగా ఎయిర్‌హోస్టెస్‌లతో ఫ్యాషన్‌షూట్‌ చేయటమే కాదు..విమానంలో బికినీ షో చేయించారు. పాపులారిటీ కోసమే వియతజెట్‌ ఎయిర్‌లైన్స్‌ అలా చేసింది. దీంతో విమానసంస్థల బోర్డు 2012లో ఈ విమానసంస్థపై జరిమానా విధించింది. బికినీ దెబ్బతో బ్యాడ్‌నేమ్‌ వస్తుందనుకున్నారంతా. విచిత్రంగా ‘బికినీ ఎయిర్‌లైన్స్‌’ అని అందరూ ముద్దుగా పిలవటం మొదలెట్టారు. దెబ్బకి లాభాలు కూడా భారీగానే వచ్చాపడ్డాయి.