Nigeria: విపక్షాల తీవ్ర నిరసనల మధ్యే నైజీరియా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బొలా తినుబు

తినుబు చేత నైజీరియా ప్రధాన న్యాయమూర్తి ఒలుకయోడే అరివూలా ప్రమాణ స్వీకారం చేయించారు. మహ్మద్ బుహారీని టినుబు ఓడించారు. 2015 నుంచి అధికారంలో ఉన్న బుహారి.. మరో రెండేళ్లు అయితే పోటీకి అనర్హులు అవుతారు. పైగా ఈ ఇద్దరు నేతలూ ఆల్ ప్రోగ్రెసివ్స్ కాంగ్రెస్ (APC) పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.

Nigeria: విపక్షాల తీవ్ర నిరసనల మధ్యే నైజీరియా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బొలా తినుబు

Bola Tinubu: నైజీరియా నూతన అధ్యక్షుడిగా బొలా తినుబు (71) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకు ముందు లాగోస్ గవర్నరుగా ఉన్న ఆయన.. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపింది. దీంతో తినుబుకు అనుకూలంగా ఓట్లు పడ్డట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, తినుబు గెలుపు నిజం కాదని విపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. సోమవారం జరిగిన ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. కానీ, తినుబు అవేవీ లెక్క చేయకుండా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

West Bengal: కాంగ్రెస్‭కు గుండు సున్నా.. పార్టీకి హ్యాండ్ ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే

నైజీరియా రాజధాని అబుజాలో జరిగిన ప్రమాణోత్సవంలో ఘనా, రువాండా దేశాధ్యక్షులు సహా ఆఫ్రికా దేశాల ప్రముఖులు హాజరయ్యారు. తినుబు చేత నైజీరియా ప్రధాన న్యాయమూర్తి ఒలుకయోడే అరివూలా ప్రమాణ స్వీకారం చేయించారు. మహ్మద్ బుహారీని టినుబు ఓడించారు. 2015 నుంచి అధికారంలో ఉన్న బుహారి.. మరో రెండేళ్లు అయితే పోటీకి అనర్హులు అవుతారు. పైగా ఈ ఇద్దరు నేతలూ ఆల్ ప్రోగ్రెసివ్స్ కాంగ్రెస్ (APC) పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.

Japan: స్వలింగ వివాహాల్ని అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధం.. జపాన్ కోర్టు తీర్పు

అధ్యక్షుడిగా తన మొదటి ప్రసంగంలో అందరినీ కలుపుకొని పోయే ప్రభుత్వాన్ని నడుపుతామని మహిళలు, యువకులకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. “మా అడ్మినిస్ట్రేషన్ మీ తరపున పరిపాలిస్తుంది. కానీ మిమ్మల్ని ఎప్పుడూ పాలించదు. ఏ విషయంలోనైనా మేము మిమ్మల్ని సంప్రదిస్తాము, మీతో మాట్లాడతాము, కానీ మా నిర్ణయాల్ని మీపై రుద్దము’’ అని నైజీరియా ప్రజలను ఉద్దేశించి తినుబు అన్నారు.