Japan: స్వలింగ వివాహాల్ని అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధం.. జపాన్ కోర్టు తీర్పు

300 కంటే ఎక్కువ జపనీస్ మునిసిపాలిటీలు ఇప్పుడు స్వలింగ జంటలు భాగస్వామ్య ఒప్పందాలలో ప్రవేశించడానికి అనుమతిస్తున్నాయి. జపాన్ జనాభాలో వీరు 65 శాతం మంది ఉన్నారు. అయినప్పటికీ స్వలింగ వివాహాలపై హక్కులను సాధించడంలో వెనకబడి ఉన్నారు

Japan: స్వలింగ వివాహాల్ని అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధం.. జపాన్ కోర్టు తీర్పు

LGBTQ: స్వలింగ సంపర్క వివాహాలపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. అనేక దేశాల్లో దీనిపై చట్టాలు చట్టాలు చేస్తున్నారు, న్యాయ విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా జపాన్ దేశంలో సైతం దీనిపై న్యాయ విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి దిగువ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్వలింగ వివాహాలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పు చెప్పింది. సెంట్రల్ జపాన్‌లోని నగోయా జిల్లా కోర్ట్ ఇచ్చిన ఈ తీర్పు తాజాగా వెలువడిన నాలుగు తీర్పులలో స్వలింగ వివాహానికి రెండవ అనుకూల తీర్పు.

West Bengal: కాంగ్రెస్‭కు గుండు సున్నా.. పార్టీకి హ్యాండ్ ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే

దీంతో స్వలింగ వివాహాలపై సాగుతున్న చర్చ మరింత ఊపందుకుంది. వివాహ సమానత్వం కోసం ప్రయత్నాలకు మరింత ఊపందుకున్నాయని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం స్వలింగ వివాహాలపై జపాన్ ప్రజల నుంచి తీసుకున్న ఒపీనియన్ పోల్స్‌లో 70% మంది ప్రజలు స్వలింగ వివాహానికి మద్దతుగా ఓటు వేశారు. అయితే ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాకు చెందిన సంప్రదాయవాద పార్టీ అయితన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) ఈ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంది.

Delhi : మాజీ ప్రియుడితో క్లోజ్‌గా ఉంటోంది.. అందుకే చంపేశా.. ఢిల్లీ బాలిక మర్డర్ కేసులో నిందితుడు చెప్పిన సంచలన విషయాలు

300 కంటే ఎక్కువ జపనీస్ మునిసిపాలిటీలు ఇప్పుడు స్వలింగ జంటలు భాగస్వామ్య ఒప్పందాలలో ప్రవేశించడానికి అనుమతిస్తున్నాయి. జపాన్ జనాభాలో వీరు 65 శాతం మంది ఉన్నారు. అయినప్పటికీ స్వలింగ వివాహాలపై హక్కులను సాధించడంలో వెనకబడి ఉన్నారు. స్వలింగ వివాహాన్ని అనుమతించినట్లయితే జపాన్ నుంచి ప్రజలు పారిపోతారని వివాదం రేకెత్తించిన ఒక నాయకుడిని ఫిబ్రవరిలో కిషిడా తొలగించారు. అయితే ఆయన సైతం దీనికి అనుకూలంగా చట్టం చేసేందుకు సముఖంగా లేనట్టు తెలుస్తోంది. అయితే కోర్టులు ఇస్తున్న తీర్పులు తమకు ఊరట కలిగిస్తున్నాయి, అవి ప్రభుత్వం కల్లు తెరిపిస్తాయని స్వలింగ వివాహాలను సమర్ధించేవారు అంటున్నారు.