China: రూ.6 కోట్లు బ్యాంకు నుంచి డ్రా చేసి, తర్వాత బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించాడు

తాను ఒక రోజులో గరిష్టంగా విత్‌డ్రా చేయగలిగిన మొత్తాన్ని తీసుకున్నానని, మిగిలిన "పది మిలియన్లు" ఇతర బ్యాంకులకు డిపాజిట్ చేయడానికి ప్లాన్‌లో ఉన్నట్లు అతడు పేర్కొన్నాడు

China: రూ.6 కోట్లు బ్యాంకు నుంచి డ్రా చేసి, తర్వాత బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించాడు

Updated On : October 27, 2023 / 6:04 PM IST

China: కౌంటింగ్ మిషన్ వచ్చాక డబ్బులను చేతితో లెక్కించడం దాదాపుగా తగ్గిపోయింది. బ్యాంకుల్లో ఎక్కడ చూసినా కౌంటింగ్ మిషన్ మీదనే డబ్బులు తిరుగుతూ ఉంటాయి. రెండు నోట్లు ఉన్నా సరే.. అందులోనే వేస్తారు. సౌకర్యాన్ని వాడుకుంటున్నారో లేదంటే మరింకేం కారణమో కానీ ప్రస్తుత ప్రపంచంలో లెక్కింపు అంతా మిషన్ల మీదే జరిగిపోతోంది. అలాంటిది ఆరు కోట్ల రూపాయల్ని చేతితో లెక్కించడం అంటే మాటలా?

చైనాకు చెందిన ఒక మిలియనీర్ ఇలాగే చేశాడు. బ్యాంక్ నుంచి 6.5 కోట్ల రూపాయలు డ్రా చేశాడు. అనంతరం చేతితో లెక్కించమని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఇది జరిగింది ఇప్పుడు కాదు. 2021లో కొవిడ్ పాండమిక్ సమయంలో. ఈ విషయం ఇప్పుడు బయటికి రావడంతో చైనా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడిదే అక్కడ ట్రెండింగ్ టాపిక్ గా నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Yogesh Kadya: 19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌.. ఏకంగా అంతర్జాతీయ క్రిమినల్ పోలీసింగ్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు

ఇన్‌సైడర్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఒక మిలియనీర్ 2021లో బ్యాంక్ ఆఫ్ షాంఘై బ్రాంచ్‌ నుంచి ఐదు మిలియన్ల రెన్మిన్‌బి (2021 మారకపు రేటు ప్రకారం $783,000, ఇండియన్ కరెన్సీలో 6.5 కోట్ల రూపాయలు) డ్రా చేశాడు. అయితే ఆయనకు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదం జరిగింది. అంతే తను డ్రా చేసిన మొత్తాన్ని లెక్కించమని బ్యాంకు సిబ్బందిని ఆదేశించాడు. తనతో బ్యాంకు సిబ్బంది భయంకరమైన వైఖరి చూపించారని వీబోలో రాసుకొచ్చాడు. డబ్బును చేతితో లెక్కించేందుకు బ్యాంకు సిబ్బందికి రెండు గంటలకు పైగా సమయం పట్టిందని అతడు చెప్పాడు.

తాను ఒక రోజులో గరిష్టంగా విత్‌డ్రా చేయగలిగిన మొత్తాన్ని తీసుకున్నానని, మిగిలిన “పది మిలియన్లు” ఇతర బ్యాంకులకు డిపాజిట్ చేయడానికి ప్లాన్‌లో ఉన్నట్లు అతడు పేర్కొన్నాడు. బ్యాంకు సిబ్బంది భారీ నగదు కట్టలను లెక్కించడం, కరెన్సీని నింపిన సూట్‌కేస్‌లతో వ్యక్తి బయటకు వెళ్తున్నట్లు చూపుతున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో, కోవిడ్-19 ప్రోటోకాల్‌ను మిలియనీర్ అనుసరించనందున అసమ్మతి జరిగిందని బ్యాంక్ తెలిపింది.

ఇది కూడా చదవండి: Ashok Gehlot said ED as Dogs: ఈడీని కుక్కలతో పోలుస్తూ వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

చైనీస్ మీడియా అవుట్‌లెట్ ది పేపర్‌ ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ షాంఘై బ్రాంచ్‌లోకి ప్రవేశించేటప్పుడు వ్యక్తి ముసుగు ధరించలేదని చెప్పారు. అప్పుడు ఉన్న ప్రోటోకాల్ ప్రకారం, భద్రతా సిబ్బంది అతనికి మాస్క్ వేసుకొమ్మని అడిగారు, అది వాదనకు దారితీసింది. బ్యాంక్ స్టేట్‌మెంట్ తర్వాత, Weiboలో అతను ముసుగు తీసుకురావడం మర్చిపోయాడని, ముసుగు ధరించడానికి నిరాకరించలేదని, కోవిడ్ -19 నిబంధనలకు కట్టుబడి ఉన్నానని అతను నొక్కి చెప్పాడు.