అగ్ని పర్వతం పేలినా పెళ్లి ఆపలేదు.. బంధువులకు వణుకు పుట్టించిన పెళ్లి

  • Published By: veegamteam ,Published On : January 15, 2020 / 01:50 AM IST
అగ్ని పర్వతం పేలినా పెళ్లి ఆపలేదు.. బంధువులకు వణుకు పుట్టించిన పెళ్లి

అందరూ అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు.. కానీ, ఓ జంట మాత్రం ఏకంగా అగ్నిపర్వతం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే.. ఈ వింత ఘటన ఫిలిప్పిన్స్‌ లో చోటుచేసుకుంది. అంతేకాదు వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా అదే సమయంలో ఫోటో కూడా తీశారు. ఆ ఫోటో చూసి గ్రాఫిక్స్ అనుకుంటే అది మీ పోరపాటు.

అగ్నిపర్వతం పేలిన వెంటనే అధికారులు వచ్చి.. అక్కడున్న జనాలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరించారు. కానీ, ఆ జంట అతిథులకు ధైర్యం చెప్పి.. వారిని అక్కడే ఉండేలా చేసి పెళ్లిని ఘనంగా జరుపుకున్నారు. అగ్నిపర్వతానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో వీరి వివాహం జరగడం అద్భుతం.

అందరూ అక్కడ ఉండటానికి ఒప్పుకున్నారనే గాని.. ఏ క్షణంలో ఏ జరుగుతుందో అనే భయంతో వణికిపోయారు. ఈ సందర్భంగా ఓ అతిథి మాట్లాడుతూ.. అధికారులు అప్పటికే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హెచ్చరించారు. దీంతో చాలా భయం వేసింది. కానీ, సోషల్ మీడియాలో వచ్చే అప్‌డేట్స్ చూస్తూ పెళ్లి అయ్యేవరకు అక్కడే కుర్చున్నాం. ఇక పెళ్లైన వెంటనే అక్కడినుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయాం అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.