అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో ఆవు పేడ కేకులు.. పట్టుకున్న అధికారులు

అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో ఆవు పేడ కేకులు.. పట్టుకున్న అధికారులు

Cow Dung

Cow dung cakes: చదువులేనివారికంటే చదువకున్నవారే మూఢ నమ్మకాల పిచ్చిలో మునిగి తేలుతున్నట్లు ఇప్పటికే అనేక సంధర్భాల్లో నిరూపితం అయ్యింది. లేటెస్ట్‌గా అమెరికా విమానాశ్రయంలో ఓ భారతీయ ప్రయాణికుడి దగ్గర ఆవుపిడకలు దొరకడం వాషింగ్టన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. లగేజీ కౌంటర్‌లో సూట్‌కేసు తెరిచి చూడగా.. కస్టమ్స్ అధికారులకు ఆవు పిడకలు దొరికాయి.

వాషింగ్టన్ డిసి శివారులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతదేశం నుంచి అమెరికాకు వచ్చిన ప్రయాణీకుడి సామానులో ఆవుపేడతో తయారుచేసిన పిడకలు గుర్తించారు యుఎస్ కస్టమ్స్ మరియు బోర్డర్ సెక్యూరిటీ అధికారులు. భారత యాత్రికుడు పేడ తెచ్చిన బ్యాగ్ విమానాశ్రయంలో పట్టుకోగా.. అమెరికాలో ఆవు పిడకలు నిషేధించబడినట్లుగా అధికారులు వెల్లడించారు.

ఆ కారణంగానే వాటిని నాశనం చేసినట్లు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సిబిపి) తెలిపింది. నోటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు చెప్పారు. ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడు ఆ సూట్‌కేసును తెచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.

ఆవు పేడతో సర్వరోగాలు నయమవుతాయని, కరోనా కూడా నయం అవుతుందనే మూఢనమ్మకం కారణంగానే ఆవుపేడతో తయారుచేసిన పిడకలను తీసుకుని వచ్చారని చెబుతున్నారు అధికారులు.