Aliens: ఏలియన్స్ ఉన్నాయా? శాస్త్రీయ పద్ధతిలో తేల్చిన నాసా.. కొన్ని గంటల్లో..

యూఎఫ్‌వోలను ఫ్లయింగ్‌ సాసర్లు అని కూడా అంటారు. వీటిపై అధ్యయనం చేసిన నాసా ఏలియన్ల గురించి తేల్చి చెప్పడానికి సన్నద్ధమైంది.

Aliens: ఏలియన్స్ ఉన్నాయా? శాస్త్రీయ పద్ధతిలో తేల్చిన నాసా.. కొన్ని గంటల్లో..

NASA crucial report on UFOs

Aliens – NASA: ఏలియన్స్ ఉన్నాయా? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (UFOs)లను గ్రహాంతర వాసులే పంపుతున్నారా? అన్న విషయాలపై ఎన్నో ఏళ్లుగా ఎన్నో వాదనలు ఉన్నాయి. ఏలియన్స్ ఉన్నాయన్న కచ్చితమైన ఆధారాలను ఇప్పటివరకు ఎవరూ బయటపెట్టలేకపోయారు.

ఏలియన్స్ గురించి ఊహాజనిత విషయాలను చాలా మంది చెబుతుంటారు. యూఎఫ్‌వోలను ఫ్లయింగ్‌ సాసర్లు అని కూడా అంటారు. వీటిపై అధ్యయనం చేసిన నాసా.. ఏలియన్ల గురించి తేల్చి చెప్పడానికి సన్నద్ధమైంది. అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫెనోమినా (UAP)పై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఓ స్వతంత్ర అధ్యయన బృందం ఏడాదిగా పరిశోధనలు చేసింది.

2022లో టీమ్ ఏర్పాటు

యూఏపీనే యూఎఫ్‌వో, ఫ్లయింగ్‌ సాసర్లు అని అంటారు. 2022లో నాసా ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ బృందం ఏలియన్లపై నివేదికతో సిద్ధంగా ఉంది. యూఎఫ్‌వోలను గ్రహాంతరవాసుల వ్యోమ నౌకలుగా చాలా మంది భావిస్తుంటారు. ఇతర గ్రహాల నుంచి యూఎఫ్‌వోలు వచ్చి భూమిని సందర్శించి వెళ్తుంటాయని అంటుంటారు.

కొన్ని దశాబ్దాల క్రితం ఆకాశంలో అవి పదే పదే కనపడేవని అమెరికా వారు చెబుతుంటారు. యూఎఫ్‌వోల గురించి యూఏపీ స్వతంత్ర అధ్యయన బృందం శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి, నివేదికను రూపొందించింది. యూఎఫ్‌వోల గురించి వీలైనంత క్షుణ్ణంగా ఆ బృందం అధ్యయనం చేసింది.

వాషింగ్టన్ నుంచి నివేదిక..

యూఎఫ్‌వోల గుట్టును ఈ బృందం విప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బృందం గత ఏడాది మాట్లాడుతూ… యూఎఫ్‌వోలకు సంబంధించిన గ్రహాంతర వాసులు ఉన్నారన్న ఆధారాలు లేవని చెప్పింది. ఈ బృందంలో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. ఆకాశంలో అప్పుడప్పుడు కనపడుతున్న యూఎఫ్‌వోల గురించి మరి కొన్ని గంటల్లో ప్రజలకు ఎన్నో విషయాలు చెప్పబోతున్నారు.

వాషింగ్టన్ లోని నాసా ప్రధాన కార్యాలయం నుంచి నివేదికను విడుదల చేయనున్నారు. యూఎఫ్‌వోలపై హై-క్వాలిటీతో అధ్యయనాలు జరిగినప్పటికీ, ఇప్పటివరకు శాస్త్రీయంగా ఆ అధ్యయనాలకు తుది రూపు ఇచ్చిన వారు లేరని నాసా చెప్పింది. యూఎఫ్‌వోలపై తాము చేసిన శాస్త్రీయ అధ్యయనాలు భవిష్యత్తులో చేయబోయే పరిశోధనలకు ఓ కచ్చితమైన మార్గాన్ని చూపుతాయని నాసా పేర్కొంది.

Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండర్‌ కొత్త ఫొటోలు పోస్ట్ చేసిన ఇస్రో