డాల్ఫిన్లు అచ్చం మనలాగే ప్రవర్తిస్తాయంట.. కలుపుగోలుగా ఉంటాయట!

డాల్ఫిన్లు అచ్చం మనలాగే ప్రవర్తిస్తాయంట.. కలుపుగోలుగా ఉంటాయట!

Dolphins personality traits similar to humans : డాల్ఫిన్లు.. చూడటానికి ఎంతో క్యూట్‌గా కనిపిస్తాయి. అంతే ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాగే అచ్చం మనలానే ప్రవర్తిస్తాయంట.. కలుపుగోలుగా ఉంటాయట.. కొత్త అధ్యయనంలో రుజువైంది. వేర్వేరు వాతావరణాల్లో ఉండే డాల్ఫిన్లు సాధారణంగా హ్యుమన్ వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉంటాయని తేలింది. వాటిలో ఆసక్తి, ఉత్సాహం, మనిషి ప్రవర్తన మాదిరిగానే ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అధ్యయనంలో భాగంగా రీసెర్చర్లు ప్రపంచవ్యాప్తంగా 100 డాల్ఫిన్లపై రీసెర్చర్లు అధ్యయనం చేశారు.
Dolphins have personality traits very similar to humans అందులో చాలావరకూ డాల్ఫిన్లు ఎంతో ఆహ్లాదకరంగా.. మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అలానే కలుపుగోలుతనంతో మెలుగుతాయని గుర్తించారు. పైదవడ, కింది దవడ బాటిల్ సైజు పొడువు ముక్కు కలిగిన డాల్ఫిన్ జాతులు ఎక్కువగా అర్కిటిక్, అంటార్కిటా మినహా అన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ రకం జాతుల్లో డాల్ఫిన్ల ముక్కు బాటిల్ నోస్ మాదిరిగా ఉంటాయి.

బాటిల్‌నోజ్ డాల్ఫిన్లలో మూడు జాతులు..
సాధారణ బాలిట్ నోస్ డాల్ఫిన్ (Tursiops truncatus), బ్యూరనేన్ డాల్ఫిన్ (Tursiops australis) జాతి డాల్ఫిన్లు, ఇండో పసిఫిక్ బాటిల్ నోస్ డాల్ఫిన్ (Tursiops aduncus) కూడా ఒక జాతి డాల్ఫిన్లుగా చెప్పవచ్చు. ఈ జాతి డాల్ఫిన్లను ఈజీగా గుర్తుపట్టొచ్చు. తీర ప్రాంతాలకు దగ్గరగా డాల్ఫిన్లు నివసిస్తుంటాయి. మనుషుల్లో తప్ప ఇతర జంతువుల్లో కంటే అతిపెద్ద మెదడు పరిమాణం కలిగి ఉంటాయి.
అధిక తెలివితేటలతో పాటు సామాజిక సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి. బ్లేక్ మోర్టన్ హల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం మెక్సికో, ఫ్రాన్స్, యుఎస్, కురాకో, నెదర్లాండ్స్, స్వీడన్, బహామాస్ కేమాన్ దీవుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి 134 సాధారణ బాటిల్‌నోజ్ డాల్ఫిన్‌లపై డేటాను సేకరించింది. ప్రైమేట్స్ మాదిరిగా డాల్ఫిన్లు చాలా తెలివైనవి కూడా. డాల్ఫిన్లు వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటాయని పరిశోధకులు అంటున్నారు.