Viral Pic : ఇంత చిన్న స్కూట‌ర్‌ తీసుకెళ్లటానికి అంత భారీ ట్రాక్కా?! బుర్రా..బుద్ధీ ఉందా?

పోలీసులు ఒక్కోసారి చూపించే అత్యుత్సాహం చూస్తే వీళ్లు మరీ ఓవర్ చేస్తున్నారనిపిస్తుంది. బ్రిటన్ లో ఓ చిన్నపాటి స్కూటను తరలించటానికి ఏకంగా ఓ భారీ ట్రక్కుని ఉపయోగించారు. అది చూసిన జనాలు ‘పోలీసులకు మరీ ఓవర్ యాక్షన్’ అంటూ తిట్టిపోస్తున్నారు.

Viral Pic : ఇంత చిన్న స్కూట‌ర్‌ తీసుకెళ్లటానికి అంత భారీ ట్రాక్కా?! బుర్రా..బుద్ధీ ఉందా?

Tiny Scooter On A 7.5 Tonne Truck In Uk (1)

Small scooter on a 7 5 tonne truck : పోలీసులు ఒక్కోసారి చూపించే అత్యుత్సాహం చూస్తే వీళ్లు మరీ ఓవర్ చేస్తున్నారనిపిస్తుంది. అటువంటి ఘటనే జరిగింది బ్రిటన్ లో. ఓ చిన్నపాటి స్కూటర్ ను తరలించటానికి ఏకంగా ఓ భారీ ట్రక్కుని ఉపయోగించారు. ఓ పేద్ద ట్రక్కుమీద ఓ చిన్న స్కూటర్ ను ఎక్కించి ఓవర్ బిల్డర్ ఇస్తూ..తీసుకెళ్లారు. అది చూసిన జనాలు ‘పోలీసులకు మరీ ఓవర్ యాక్షన్’ అంటూ తిట్టిపోస్తున్నారు. 15కిలోల బ‌రువున్న స్కూట‌ర్‌ను తీసుకెళ్లటానికి 7.5 ట‌న్నుల ట్ర‌క్ ఉపయోగించి బ్రిటన్ పోలీసులు న‌వ్వుల‌పాల‌య్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ గా మారటంతో అది చూసిన నెటిజ‌న్లు పోలీసుల‌పై సెటైర్లు వేస్తున్నారు.

అసలు ఈ స్కూటర్ ఎవరిది? దాన్ని ఎందుకు అంత భారీ ట్రక్కుమీద తీసుకెళుతున్నారంటే..రోడ్లపై ఓ వ్యక్తి ఈ స్కూటర్ పై నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా తిరుగుతున్నాడు. అతనిడి ఆపిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని తరలించటానికి ఓ భారీ ట్రక్ మీకు ఎక్కించారు. ట్రక్ వెనుక భాగంలో ఈ టూ వీలర్ ను తీసుకెళ్లారు.

ఈ ఫొటోను బ్రిట‌న్‌లోని హియ‌ర్‌ఫోర్డ్ పోలీసులు త‌మ ఫేస్‌బుక్ పేజీలో షేర్‌చేయటంతో జనాలు పోలీసులపై సెటైర్లు వేస్తున్నారు. అంత పేద్ద భారీ వాహ‌నంపై ఇంత చిన్న‌సైజు స్కూట‌ర్‌ను తీసుకెళ్ల‌డం ఏంటీ. మరీ విడ్డూరం కాకపోతే..అంటూ మండిప‌డ్డారు. ఆ చిన్న స్కూట‌ర్‌ను మ‌లిచి పోలీసుల కారు పట్టేస్తుంది..దాంట్లోనే తీసుకెళ్ల‌వ‌చ్చుక‌దా? అంత చిన్న స్కూట‌ర్‌కు భారీ వాహ‌నం వాడాలా? ఓవర్ యాక్షన్ కాకపోతే..అంటున్నారు.