Russia Ukraine war: రెండు వారాలుగా యుద్ధం చేస్తున్న రష్యా, అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?

ఇన్ని ఆంక్షల నడుమ రష్యాకు ఇంత ఆదాయం ఎలా వస్తుంది?. రష్యాకు ప్రధాన ఆదాయ వనరు ఏమిటి? అనే సందేహాలు తలెత్తడం సహజం

Russia Ukraine war: రెండు వారాలుగా యుద్ధం చేస్తున్న రష్యా, అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?

War

Russia Ukraine war: రెండు వారాలుగా రష్యా యుక్రెయిన్ పై యుద్ధం చేస్తుంది. టన్నుల కొద్ది బాంబులను మోసుకెళ్తూ యుక్రెయిన్ నగరాలను ధ్వంసం చేస్తున్నారు రష్యా సైనికులు. యుక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై అనేక దేశాలు ఆర్ధిక, దౌత్య పరమైన ఆంక్షలు విధించాయి. కొన్ని అంతర్జాతీయ ప్రైవేటు సంస్థలు సైతం రష్యాలోని తమ కార్యకలాపాలను సైతం నిలిపివేసి.. నష్ఠాలను నమోదు చేసుకున్నాయి. యుద్ధం కారణంగా రష్యా కరెన్సీ విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. అయినా రష్యా యుద్ధం కొనసాగిస్తుంది. యుద్ధం చేయాలంటే దేశంలో ఆర్ధిక పరిస్థితి బాగుండాలి. అప్పుడే నిరాటంకంగా యుద్ధం కొనసాగించవచ్చు. అయితే ఇన్ని ఆంక్షల నడుమ రష్యాకు ఇంత ఆదాయం ఎలా వస్తుంది?. రష్యాకు ప్రధాన ఆదాయ వనరు ఏమిటి? అనే సందేహాలు తలెత్తడం సహజం.

Also read: Russia Ukraine War : యుక్రెయిన్‌కు భారీ విరాళమిచ్చిన స్టార్‌ హీరో.. ఆయన ఎవరంటే?

ఇటీవల చేపట్టిన అధ్యయనం ప్రకారం యూరప్ దేశాలు ప్రతిరోజూ సరాసరి $285 మిలియన్ డాలర్లను (£217m) చమురు చెల్లింపుల రూపంలో రష్యాకు చెల్లిస్తున్నాయి. రష్యాకు ప్రధాన ఆదయ మార్గంగా ఉన్న ఈ డబ్బుతోనే రష్యా యుద్ధం కొనసాగిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేశారు. యూరోప్ లోని బెల్జియంకు చెందిన రవాణా మరియు పర్యావరణం (T&E) సమాఖ్య తెలిపిన వివరాలు మేరకు..యూరప్ మరియు యూకే దేశాలకు క్రూడ్, పెట్రోల్ మరియు డీజిల్ ఎగుమతుల ద్వారా గత సంవత్సరం $104 బిలియన్లను ఆదాయంగా పొందింది రష్యా. గ్యాస్ ఎగుమతులతో పోల్చుకుంటే ఇది రెండింతలు ఎక్కువ. యూరోప్ లోని అనేక దేశాలు.. తమ్ అవోయిల్ అవసరాల్లో నాలుగింట ఒక వంతు రష్యా ఆయిల్ పైనే ఆధారపడి ఉన్నాయి.

Also read: Russia-ukraine war : ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ పాట పాడిన యుక్రెయిన్ మిలిటరీ బ్యాండ్

ఇప్పటికిప్పుడు రష్యా ఆయిల్ ను నిలిపివేసి.. సౌదీ అరేబియా నుంచి ఆయిల్ తెచ్చుకోవడం సాధ్యం కాదు. దీంతో తప్పనిసరి పరిస్థితిల్లో రష్యా నుంచే నిత్యం $285 మిలియన్ డాలర్ల ముడి చమురును యూరోప్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే చమురు కోసం మరో దేశంపై ఆధారపడకుండా.. రవాణా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని, విద్యుత్ వాహనాలను వినియోగించేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలని T&E ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విలియం టాడ్స్ అన్నారు. మరోవైపు తమ దేశంపై ఇతర దేశాలు ఆంక్షలు విధించడంపై రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ స్పందిస్తూ, రష్య నుంచి చమురును తిరస్కరించడం “విపత్కర పరిణామాలకు” దారి తీస్తుందని, ఆయా దేశాలు ఒక్కో బ్యారెల్‌ ను $300 వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Also read: Russia Ukraine War : యుక్రెయిన్‌‌కు సాయం చేస్తానన్న పోలాండ్.. అడ్డుచెప్పిన అమెరికా..!