Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్.. నిరంతర పేలుళ్లు.. 137మంది మృతి

యుక్రెయిన్‌లో ర‌ష్యా ర‌క్తపాతం సృష్టిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. కీవ్ గగనతలంపై రష్యా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి.

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్.. నిరంతర పేలుళ్లు.. 137మంది మృతి

Ukrain

Russia Ukraine War: యుక్రెయిన్‌లో ర‌ష్యా ర‌క్తపాతం సృష్టిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. కీవ్ గగనతలంపై రష్యా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. భయంగుప్పెట్లో కీవ్ ప్రజలు గడుపుతుండగా.. కీవ్ విమానాశ్రయాన్ని రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కీవ్, ఖర్కీవ్, తూర్పు దొనెట్స్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి.

యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసి దాదాపు 24 గంటలవగా.. ప్రతీ నిమిషంలో దాడులు తీవ్రమవుతున్నాయి. యుక్రెయిన్ వైపు నుండి ప్రతీకారం కూడా జరుగుతోంది, కానీ రష్యన్ సైన్యం ముందు యుక్రెయిన్ సరిపోవట్లేదు. రష్యా బలగాలు ప్రణాళికాబద్ధంగా యుక్రెయిన్‌పై దాడి చేశాయి.

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంతకు ముందు ఏ యుద్ధంలోనూ కనిపించని వేగం. యుక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యా ప్రవేశించాక జరిగింది.

ఎర్ర సైన్యం చెర్నోబిల్ అణు కర్మాగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. ఈ పోరాటంలో ఇప్పటి వరకు 137 మంది యుక్రెయిన్ పౌరులు మరణించారు. అదే సమయంలో, యుక్రెయిన్ సైన్యం అనేక రష్యన్ విమానాలను ద్వంసం చేసింది. రష్యా సైన్యం మొదట యుక్రెయిన్ మిలిటరీ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ బేస్‌లు, ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసి నాశనం చేసింది.

సైనిక, వైమానిక, ఓడరేవులు, కీలక, వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా రష్యన్‌ సేనలు భీకర దాడులు చేస్తుండగా.. యుక్రెయిన్‌కి చెందిన 83 సైనిక స్థావరాలను 11 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఓ సైనిక హెలికాప్టర్‌తో పాటు నాలుగు డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది.