అమెరికా మ్యాచ్‌లో ఢిల్లీ రైతు ఆందోళనపై యాడ్.. చరిత్రలోనే భారీ ఆందోళనగా

అమెరికా మ్యాచ్‌లో ఢిల్లీ రైతు ఆందోళనపై యాడ్.. చరిత్రలోనే భారీ ఆందోళనగా

Farmers Protest: ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై సోషల్ మీడియా కోడై కూస్తుంది. అమెరికన్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ లో భాగంగా జరిగిన సూపర్ బౌల్ 2021 మ్యాచ్ లో రైతు ఉద్యమంపై అడ్వర్టైజ్మెంట్ టెలికాస్ట్ అయింది. దీనిని చాలా ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. అమెరికాలో చాలా మంది వీక్షించే స్పోర్టింగ్ ఈవెంట్స్ లో సూపర్ బౌల్ ఒకటి. అందులో యాడ్ ఇవ్వడం అంటే బాగా కాస్ట్లీ కూడా. రూ.36కోట్ల నుంచి రూ.44కోట్ల మధ్య ఉంటుంది.

విడివిడిగా, గ్రూపుల వారీగా, ఆర్గనైజేషన్స్ పరంగా రైతు ఆందోళన చేస్తున్నప్పటికీ ఇది కేవలం కాలిఫోర్నియాలో మాత్రమే టెలికాస్ట్ అయింది. ఆ తర్వాత దీనిని పలు ట్విట్టర్ ఖాతాల్లోనూ పోస్టు చేశారు. ‘సూపర్ బౌల్ జరుగుతుండగా రైతుల గురించి వచ్చిన మెసేజ్ ఒక్కసారి వినండి. ఈ యాడ్ ఫ్రెస్నో కంట్రీ కాలిఫోర్నియాలో మధ్యాహ్నం 3 నుంచి 3గంటల 30నిమిషాల మధ్యలో ఛానెల్ 47 కేఎస్ఈఈ 24లో ప్రసారం అయింది.

ఈ 30 సెకన్ల వీడియో ఆరంభంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కొటేషన్ తో స్టార్ట్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన చరిత్రలోనే భారీ ఆందోళనగా నిలిచపోనుందని రాసుకొచ్చారు. నిజానికి ఇది టెలికాస్ట్ అయింది కేవలం సూపర్ బౌల్ ఈవెంట్ లో మాత్రమే. రైతు ఆందోళనపై అందరికీ తెలియాలనే అవగాహన కోసం.. వ్యాలీ సిక్ కమ్యూనిటీ వారు స్పాన్సర్ చేసి యాడ్ ను లోకల్ ఛానెల్స్ లో టెలికాస్ట్ చేయించారు.

దీనిని సింగర్ జాజ్జీ బీ కన్ఫామ్ చేస్తూ.. వరల్డ్ ఈజ్ వాచింగ్ అని ట్వీట్ చేశారు. మరో యూజర్ ఇదిగో సూపర్ బౌల్ యాడ్.. రైతుల ఆందోళన గురించి చెప్తుంది. దీని గురించి ఇప్పటివరకూ మీరు తెలుసుకోకపోయి ఉంటే ఇప్పుడు తెలుసుకోండి. వాళ్లకు జరిగే అన్యాయం మనందరిపైనా ఎఫెక్ట్ చూపిస్తుంది’ అని రాసుకొచ్చారు.