కోపంగా ఉందా.. రండి రేజ్ రూమ్‌లో వస్తువులు పగులగొట్టండి..

కోపంగా ఉందా.. రండి రేజ్ రూమ్‌లో వస్తువులు పగులగొట్టండి..

Rage Room: ఫ్రస్ట్రేటెడ్ గా ఫీలవుతున్నారా.. స్ట్రెస్ అయి ఉన్నారా.. ? మీకు ఓ భారీ బంపర్ ఆఫర్. ఫ్రస్ట్రేషన్, కోపం లాంటి వాటి నుంచి రిలాక్స్ అవడం కోసమే రెడీ అయింది రేజ్ రూం. బ్రెజిల్‌లోని సావో పాలో సరిహద్దుల్లో పెద్ద పెద్ద సుత్తులు.. టీవీలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, మెషీన్లు, ముక్కలుముక్కలుగా పడి ఉన్న అద్దాలు కనిపిస్తాయి.

ఇదంతా సెట్ చేసింది ఎవరో కాదు. 42సంవత్సరాల వాండెర్లీ రోడ్రిగ్స్.. నెల క్రితం సిడెడె టిరాడెంటీస్ దీనిని మొదలుపెట్టారు. చాలా యాంగ్జైటీ, స్ట్రెస్ నుంచి తేరుకోవాలనే ఇది మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే.. కేవలం రూ.340 చెల్లిస్తే సరిపోతుంది.

ఈ రూంలోకి వెళ్లేముందు ప్రొటెక్షన్ సూట్, హెల్మెట్స్ తప్పనిసరిగా ఇస్తుంటారు. వారు బాధపడుతున్న ఇష్యూ గురించి అక్కడి గోడలపై రాసుకుని అది కనిపిస్తుండగా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ హస్బెండ్, కరప్షన్, వర్క్ లను గుర్తు చేసుకుంటూ కోపాన్ని తీర్చుకుంటున్నారు.

అలెగ్జాండర్ డె కర్వాల్లో 40ఉద్యోగానికి వెళ్లే ముందు అక్కడికి వెళ్లి వస్తుంటానని చెప్తున్నారు. మహమ్మారి సమయంలో ఆరోగ్యం గురించి చాలా సతమతమయ్యానని.. ఇక్కడకు వచ్చి రిలీఫ్ పొందానని, వీటి వల్ల అడ్రినలైన్ ప్రొడ్యూస్ అయి ఫీలింగ్స్ మారుతున్నాయని అంటున్నారు.

ఇద్దరు కుమార్తెలకు తల్లి అయిన లూసియానా హోలాండా (35) నిరుద్యోగిగా ఇంట్లోనే ఉంటున్నారు. రేజ్ రూంకు వెళ్లి ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నానని చెప్తున్నారు. ఓ తల్లిగా తీవ్రమైన ఒత్తిడి, పిల్లలను బ్యాలెన్స్ చేయడం, ఏ పని చేయకుండా ఉండటం లాంటివాటి నుంచి ఒత్తిడిని పోగొట్టుకోవాలంటే ఇది చాలా మంచి టెక్నిక్. ఎందుకంటే నా ఫ్రస్ట్రేషన్ నా కూతుళ్లపైనా లేదా మరెవరిపైనో తీర్చుకోలేను కదా.. అందుకనే వస్తువులను బ్రేక్ చేయడాన్ని ఇష్టపడుతున్నా’ అని రాసుకొచ్చారు.