American Navy : అమెరికన్ నేవీ చరిత్రలో తొలి మహిళా సెయిలర్…శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి

అమెరికా నేవీ చరిత్రలో సువర్ణక్షారాలతో లిఖించాల్సిన విషయం ఇది.. ఎందుకంటే నేవీలో ఇప్పటి వరకు మహిళలకు చోటు దక్కలేదు.

American Navy : అమెరికన్ నేవీ చరిత్రలో తొలి మహిళా సెయిలర్…శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి

Navy

American Navy : నేవీలో చేరాలంటే అంత తేలికేం కాదు. అక్కడ ఇచ్చే శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరటమంటే పెద్ద సాహసంతో కూడుకున్న పని. అందులోనూ అమెరికా నౌకాదళంలో చేరే వారికి ఇచ్చే శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. నేవీలో చేరేందుకు ఇక్కడ పురుషులు తప్ప మహిళలు ముందుకు వచ్చే పరిస్ధితిలేదు. ఒకవేళ వచ్చినా శిక్షణ సమయంలోనే తమ వల్ల కాదంటూ వెళ్ళిపోతారు. అయితే తొలిసారిగా అమెరికా నేవి చరిత్రలో ఓ మహిళ కఠినమైన శిక్షణను పూర్తి చేసుకుని సెయిలర్ గా నియమితురాలైంది.

అమెరికా నేవీ చరిత్రలో సువర్ణక్షారాలతో లిఖించాల్సిన విషయం ఇది.. ఎందుకంటే నేవీలో ఇప్పటి వరకు మహిళలకు చోటు దక్కలేదు. స్పెషల్ వార్ ఫేర్ కాంబటాంట్ క్రాఫ్ట్ క్రూమ్యాన్ లో సెయిలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీకాగా పెద్ద సంఖ్యలో ధరఖాస్తులు వెల్లువెత్తాయి. ధరఖాస్తు దారుల్లో మహిళలు కూడా ఉన్నారు. వారిలో చాలా మంది ఎంపికైనప్పటికీ శిక్షణ దశలో వారంతా తమవల్లకాక వెళ్ళిపోయారు. 18మంది మహిళల్లో కేవలం నలుగురు మహిళలు మాత్రమే శిక్షణకు మిగిలారు. వీరిలో ఓ మహిళ తన శిక్షణను పూర్తి చేసుకుని అమెరికా నేవీ తొలి మహిళా సెయిలర్ గా నియమితురాలు కాగా, మరో ముగ్గురు మహిళలు శిక్షణ పొందుతున్నారు. 2016లో అమెరికా ప్రభుత్వం నేవీ ఉద్యోగాల్లోకి మహిళలను తీసుకోవాలని నిర్ణయించింది.

నేవీ శిక్షణ అంటే అంత ఆషామాషికాదు. విభిన్న రీతుల్లో 37వారాల పాటు ఈ శిక్షణ ఉంటుంది. ఆయుధాల వాడకంతోపాటు, ఆక్సిజన్ లేకుండా సముద్రపు అంచుల వరకు వెళ్ళిరావటం, స్పీడ్ బోటింగ్, ఎత్తు నుండి సముద్రంలోకి దూకటం, వంటి శిక్షణ ఇస్తారు. శిక్షణ చివర్లో 72 గంటల తుది పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారే సెయిలర్ ఉద్యోగానికి అర్హత సాధించినట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ఈ శిక్షణకు ఎంపికైన వారి వివరాలు మాత్రం నౌకాదళం చాలా గోప్యంగా ఉంచుతుంది.