Wonder Place: సముద్రం మధ్యలో వేలిముద్రలాంటి “ద్వీపం”

ఆకాశంలో నుంచి చూసే వారికి, అచ్చం "బొటనవేలిముద్రలా" కనిపించే ఈ బుల్లి ద్విపం ఇప్పుడు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది.

Wonder Place: సముద్రం మధ్యలో వేలిముద్రలాంటి “ద్వీపం”

Fingerprint

Wonder Place: అన్వేషించాలేగాని భూమిపై అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అందమైన జలపాతాలు, మంచుపర్వతాలు, ఆకుపచ్చని అడవులు ఇలా భూమిపై అన్నిచోట్లా ప్రకృతి రమణీయంగా రూపుదిద్దుకుంది. కొన్నిసార్లు ఆ అందాలు ఆశ్చర్యకరంగానూ ఉంటాయి. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న ద్వీపంలా. బాల్జెనాక్ ద్వీపం(Baljenac Island)గా పిలువబడే ఈ ఐలాండ్, క్రొయేషియా దేశ సముద్ర భాగంలోని షిబెనిక్ ద్వీపసమూహంలో ఉంది. ఆకాశంలో నుంచి చూసే వారికి, అచ్చం “బొటనవేలిముద్రలా” కనిపించే ఈ బుల్లి ద్విపం ఇప్పుడు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. కేవలం 1.30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈబొటనవేలి ద్విపం గురించి మరిన్ని విశేషాలు.

ద్వీపంలో ముద్రలు ఎలా ఏర్పడ్డాయి అని అనుకుంటున్నారా?. అసలు విషయానికి వస్తే.. సుమారు 200 ఏళ్ల క్రితం ఈ ద్విపంలో పంటలు పండించడం, వైన్ తయారు చేయాడం వంటి పనులు చేసేవారట. అయితే సముద్ర మధ్యలో ఉండడంతో అప్పుడప్పుడు పెద్ద అలలు వచ్చి పంటలను నాశనం చేస్తుండడంతో..ఇలా రాళ్లు పేర్చి, బంక మట్టితో గట్టిగా కట్టలు కట్టారు అప్పటి ప్రజలు. కొన్నేళ్లకు ఇక్కడ పనులు చేయడం ఆగిపోగా, ఆ కట్టలు మాత్రం అలానే ఉండిపోయాయి. అలా 14 ఎకరాల్లో చుట్టూరా కట్టిన గోడల వంటి నిర్మాణం సుమారు 24 కిలోమీటర్లు ఉంది. ఇక ప్రస్తుతం ఇక్కడ పంటలేవి పండించడం లేదు. దీంతో ఈ బాల్జెనాక్ ద్వీపాన్ని పర్యాటక ప్రాంతంగా క్రొయేషియా ప్రభుత్వం తీర్చిదిద్ధింది.

అయితే ఇక్కడకు వస్తున్న కొద్ది మంది పర్యాటకులు సైతం ఆ గోడలను నాశనం చేస్తున్నారు. దీంతో ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్న ఈ ద్విపం, స్వరూపాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వేలి ముద్ర ద్విపాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించి..మరింత అభివృద్ధి చేయాలనీ అక్కడి ప్రభుత్వం కోరుతుంది. ఇటీవల ఈప్రాంతానికి వెళ్లిన కొందరు “ట్రావెల్ వ్లోగర్స్”..ఏమంటున్నారంటే.. పర్యటనలు అంటే ఇష్టపడే వారు ఈ “వేలిముద్ర ద్వీపాన్ని” తప్పక తమ లిస్టులో చేర్చుకోవాలంటూ చెప్పుకొస్తున్నారు.

Also read: New Year Resolution: కొత్త సంవత్సరంలో మందు మానేద్దామనుకుంటున్నారా?