New Year Resolution: కొత్త సంవత్సరంలో మందు మానేద్దామనుకుంటున్నారా?

మద్యానికి బానిసైన వారు దాన్ని మానేద్దామనుకున్నా తప్పించుకోలేని పరిస్థితి. అయితే కనీసం ఒక నెల పాటుగా మద్యాన్ని మానేయడం వలన అనేక లాభాలు ఉంటాయి

New Year Resolution: కొత్త సంవత్సరంలో మందు మానేద్దామనుకుంటున్నారా?

Alcohol

New Year Resolution: కొత్త సంవత్సరం సందర్భంగా కొందరు, వ్యక్తిగత తీర్మానాలు చేసుకుంటుంటారు. పాత అలవాట్లు మార్చుకుని కొత్త నిర్ణయాలు తీసుకుని, జీవితాన్ని చక్కదిద్దుకోవాలని భావిస్తారు. కొత్త సంవత్సరంలో నాలుగు రోజులు గడిచాకా ఆనిర్ణయాల అమలు పరిస్థితి ఎలా ఉన్నా..అసలంటూ ఏదో ఒక తీర్మానం ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా “న్యూ ఇయర్ రిజల్యూషన్” సందర్భంగా అత్యధికులు తీసుకునే తీర్మానాలు..మందు, సిగరెట్ మానేయడం. అయితే వీటిని వ్యసనంగా అలవాటు పడిన వారు కొన్ని రోజులకే తిరిగి పుచ్చుకుంటున్నారట. మద్యానికి బానిసైన వారు దాన్ని మానేద్దామనుకున్నా తప్పించుకోలేని పరిస్థితి. అయితే కనీసం ఒక నెల పాటుగా మద్యాన్ని మానేయడం వలన అనేక లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also read: Best Sports Bikes: 2021లో వచ్చిన టాప్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే

కొత్త సంవత్సరంలో ఇలా నెలపాటు మందు మానేసే వారికి, దానివలన కలిగే లాభాల గురించి ఆరోగ్య పండితులు ఏమంటున్నారంటే..మద్యాన్ని మానేసిన వారిలో అనేక ఆరోగ్యకర లక్షణాలు కనిపించాయట. వారం పాటు మద్యాన్ని మానేయగా కడుపు ఉబ్బరం, ముఖం, కాళ్ళు, చేతులలో వాపు పూర్తిగా తగ్గిపోయింది. మద్యాన్ని సేవించినప్పుడు “ఎపినెఫ్రిన్” అనే స్ట్రెస్ హార్మోన్ ప్రబావితమై మనిషి నిద్రపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఆల్కహాల్ శరీరంలోనికి వెళ్ళినప్పుడు జీర్ణక్రియలోని మంచి బాక్టీరియాను చంపేస్తుంది. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. 30 రోజుల పాటు మద్యం మానేసిన వారి ఆరోగ్యం మునుపటికంటే మెరుగ్గాఉన్నట్టు తేలింది. మద్యం మానేసి, రోజూ మంచి నిద్ర, ఆహారం తీసుకున్న వారిలో కొత్త శక్తి తయారైనట్లు పరిశోధకులు గుర్తించారు. అంతే కాదు, నెల రోజుల తరువాత వారిలో కాంఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగి, మంచి నిర్ణయాలు తీసుకున్నారట.

మద్యాన్ని ఒక్క నెల మానేయడం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో గమనించారుగా. మరి పూర్తిగా మానేస్తే ఇంకెన్ని లాభాలు ఉంటాయో మీరు ఆలోచించండి. ఒక వేళా మీరు మద్యాన్ని సేవిస్తూ, మానేయాలని భావిస్తుంటే.. ఈ నూతన సంవత్సరంలోనైనా సరైన తీర్మానం చేసుకోండి. జీవితాన్ని సాఫీగా ఆస్వాదించండి

Also read: Top 10 Most Viewed Telugu Songs: పాట నచ్చిందా.. హీరోలకు రికార్డులు కట్టబెడుతున్న నెటిజన్లు