Best Sports Bikes: 2021లో వచ్చిన టాప్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే

బజాజ్, కేటీఎం, యమహా, టీవీఎస్ వంటి కంపెనీలకు చెందిన స్పోర్ట్స్ బైక్స్ ఇండియాలో ఉన్నాయి. 2021లో లాంచ్ అయి.. మార్కెట్లో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ బైక్స్

Best Sports Bikes: 2021లో వచ్చిన టాప్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే

Bikes

Best Sports Bikes: ఇండియాలో స్పోర్ట్స్ బైక్స్(Fully Faired) జోరు పెరిగింది. యువతను ఆకట్టుకునేందుకు బైక్ కంపెనీలు సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా మార్కెట్లోకి వస్తున్న ఈ బైక్ లు అందరికి అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. బజాజ్, కేటీఎం, యమహా, టీవీఎస్ వంటి కంపెనీలకు చెందిన స్పోర్ట్స్ బైక్స్ ఇండియాలో ఉన్నాయి. 2021లో లాంచ్ అయి.. మార్కెట్లో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ బైక్స్ ఏంటో చూద్దాం.

KTM RC 125: కొత్త స్టైలింగ్, అధునాతన ఫీచర్లు, రివైజ్డ్ హార్డ్‌వేర్‌ను కలిగి ఉన్న ఈ RC 125 స్పోర్ట్స్ బైక్ మంచి మేక్ఓవర్ తో ఆకట్టుకుంటుంది. 2021లో వచ్చిన ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు పెద్దదిగా మరియు మరింత ప్రీమియంగా కనిపిస్తోంది. 125cc ఇంజిన్, పెద్ద ఎయిర్‌బాక్స్‌తో వస్తున్న KTM RC 125 ధర రూ. 1.82 లక్షలుగా ఉంది.

యమహా YZF R15 V4: యమహా R15 ఇండియాలో లాంచ్ చేసిన నాటినుండి విపరీతమైన జనాదరణను పొందుతోంది. ప్రధానంగా యాక్సెసిబిలిటీ, స్పోర్టినెస్ సమపాల్లో కలిగిన ఈ బైక్ యువతను ఇట్టే ఆకట్టుకుంది. 2021లో ఈ యమహా R15 మోటార్‌సైకిల్ పెద్ద అప్‌డేట్‌ తో వచ్చింది. ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ మరియు అప్‌సైడ్-డౌన్ ఫోర్క్స్ వంటి అనేక కొత్త ఫీచర్స్ ఈ బైక్ లో జోడించారు. ఈ బైక్ ధరలు రూ.1.71 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Also Read: Nellore News: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఆనం

TVS Apache RR 310: ఇండియాలో తయారై అమ్ముడవుతున్న స్పోర్ట్స్ బైక్ లలో అత్యంత ఖరీదైన బైక్ ఇది. బీఎండబ్ల్యూతో చేతులు కలిపాక టీవీఎస్ కంపెనీ నుంచి వచ్చిన పెద్ద బైక్ ఇది. ఈ బైక్ యువతను అమితంగా ఆకట్టుకుంటుంది. 2021లో “రిఫ్రెష్” మోడల్ గా వచ్చిన ఈ బైక్ “డైనమిక్, రేస్” అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ అపాచీ RR 310 ధర Rs 2.60 లక్షలుగా ప్రారంభం అవుతుంది.

Bajaj Pulsar RS 200: దేశీయ వాహన దిగ్గజం బజాజ్ నుంచి వచ్చిన ఈ పల్సర్ RS200 బైక్ అమ్మకాల పరంగా పర్వాలేదనిపించింది. 2021లో ఈ బైక్ లో ఎటువంటి అప్డేట్ లేకపోయినా.. బైక్ ప్రియులు ఈ బైక్ గురించి తెగ ఆరా తీశారంట. 200CC ఇంజిన్ సామర్ధ్యం 24.14bhp పవర్, 18.7Nm టార్క్ కలిగి ఉన్న ఈ బైక్ RS200 ధర Rs 1.63 లక్షలుగా ఉంది.

Also Read: Best Gadgets in 2021: 2021లో వచ్చిన ఈ గ్యాడ్జెట్స్ 2022లోనూ సూపర్ హిట్టే

KTM RC 390: బడ్జెట్ పరంగా RC390 ఈకోవలోకి రాకపోయినప్పటికీ ఇండియాలో అమ్ముడవుతున్న స్పోర్ట్స్ బైక్ లలో ఈ బైక్ అమ్మకాలు భేష్ అనిపిస్తున్నాయి. ఫీచర్స్ పరంగా మిగతా బైక్ లన్ని దీని ముందు దిగదుడుపే. TFT display, switchable ABS, a lean-angle sensitive cornering ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి టాప్ ఎండ్ ఫీచర్స్ తో వస్తున్న ఈ RC390 ధర Rs 2.77 లక్షలుగా ఉంది.
సో, ఇవి 2021లో విడుదలై వినియోగదారులను ఆకట్టుకుంటున్న బెస్ట్ స్పోర్ట్స్ బైక్స్

Also read: Twitter Trending: “అత్రంగి రే” చిత్రాన్ని బహిష్కరించండి