Twitter Trending: “అత్రంగి రే” చిత్రాన్ని బహిష్కరించండి

"అత్రంగి రే" చిత్రాన్ని బహిష్కరించాలంటూ వేల సంఖ్యలో ట్వీట్లు వస్తున్నాయి. ట్విట్టర్లో "#Boycott_Atrangi_Re" హ్యాష్ ట్యాగ్ 70 వేలకు పైగా ట్యాగ్ లతో ట్రెండింగ్ లో ఉంది.

Twitter Trending: “అత్రంగి రే” చిత్రాన్ని బహిష్కరించండి

Atrangire

Twitter Trending: బాలీవుడ్ సినిమాలపై ప్రేక్షకులకు విసుగొచ్చేస్తుందా?. కొత్తగా వస్తున్న సినిమాలు ఎందుకు ప్రేక్షకాదరణ పొందడం లేదు?. హిందీలో విడుదలైన “అత్రంగి రే” చిత్రం విమర్శలపాలౌతుంది. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ నటించిన ఈచిత్రం ఇటీవల డీస్నీ హాట్ స్టార్ లో విడుదలైంది. నటన పరంగా అందరికీ మంచిమార్కులే పడ్డా.. కథ, కధాంశం భారతీయుల సెంటిమెంట్ ను దెబ్బతీసేలా ఉందంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వెంటనే “అత్రంగి రే” చిత్రాన్ని బహిష్కరించాలంటూ వేల సంఖ్యలో ట్వీట్లు వస్తున్నాయి. బుధవారం ట్విట్టర్లో “#Boycott_Atrangi_Re” హ్యాష్ ట్యాగ్ 70 వేలకు పైగా ట్యాగ్ లతో ట్రెండింగ్ లో ఉంది.

ఇంతలా చిత్రాన్ని బహిష్కరించాల్సిన అంశం ఆ చిత్రంలో ఏముందంటే..”అత్రంగి రే” చిత్రం “లవ్ జిహాద్”ను ప్రోత్సహించేలా ఉండడమే. చిత్రంలో.. రింకు అనే యువతి సజ్జాద్ అనే ముస్లిం యువకుడితో ప్రేమలో ఉంటుంది. అయితే ఆ యువతికి మరొక వ్యక్తితో పెళ్లి జరిపిస్తారు ఆమె కుటుంబ సభ్యులు. అయినా ప్రేమను దక్కించుకోవడం కోసం యువతి ఆడే డ్రామానే ఈచిత్ర సారాంశం. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లైన మహిళ మరొక వ్యక్తితో ఎలా వెళ్ళిపోతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా “లవ్ జిహాద్”ను ప్రోత్సహించేలా ఉందంటూ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చిత్రాన్ని నిలిపివేయాలంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు.

Also Read: Anantapur News: అనంతపురం జిల్లాలో జింకల వేట కలకలం: నలుగురు వేటగాళ్లు అరెస్ట్

ఇదే కాదు, ఇటీవల సన్నీ లియోన్ నటించిన “మధుబన్” పాట కూడా దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ, సాక్షాత్తు మధ్యప్రదేశ్ హోం మంత్రే ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో భారతీయ సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తం చేసిన హిందీ చిత్రాలు, నేడు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు

Also read: Road Tax on Cycle: సైకిల్ పై రూ.1.51 లక్షల రోడ్డు ట్యాక్స్: బిత్తరపోయిన వ్యక్తి