Anantapur News: అనంతపురం జిల్లాలో జింకల వేట కలకలం: నలుగురు వేటగాళ్లు అరెస్ట్

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టాలపల్లి సమీపంలోని పంటపొలాల్లో జింక మాంసం అమ్ముతున్నారంటూ స్థానికుల నుంచి సమాచారం అందింది.

Anantapur News: అనంతపురం జిల్లాలో జింకల వేట కలకలం: నలుగురు వేటగాళ్లు అరెస్ట్

Uravakonda Police

Updated On : December 29, 2021 / 4:28 PM IST

Anantapur News: అనంతపురం జిల్లాలో జింకల వేట, మాంసం విక్రయం కలకలం రేపింది. బుధవారం ఉరవకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులు ఘటన తాలూకు వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టాలపల్లి సమీపంలోని పంటపొలాల్లో జింక మాంసం అమ్ముతున్నారంటూ స్థానికుల నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఉరవకొండ సీఐ శేఖర్.. తన సిబ్బందితో కలిసి ఘటన స్థలికి చేరుకున్నారు. జింకలను వేటాడి.. వాటి మాంసాన్ని విక్రయిస్తుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Also Read: Road Tax on Cycle: సైకిల్ పై రూ.1.51 లక్షల రోడ్డు ట్యాక్స్: బిత్తరపోయిన వ్యక్తి

ఈఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి వేటకు ఉపయోగించిన ఉచ్చులు, కత్తులు, సహా 25 కేజీల జింక మాంసం, జింకల కొమ్ములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా గుంతకల్ మరియు పరిసర ప్రాంతాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన పోలీసులు వారి సమక్షంలో, స్వాధీనం చేసుకున్న జింక మాంసాన్ని పరీక్షలు జరిపించి.. నివేదిక అనంతరం దహనం చేసారు. నిందితులు గతంలో అడవి పందులను వేటాడేవారని, అయితే గత కొంత కాలంగా జింకలను వేటాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

Also Read: Cold Wave in Northeast: మంచు దుప్పటి కప్పుకున్న ఈశాన్య రాష్ట్రాలు