Cold Wave in Northeast: మంచు దుప్పటి కప్పుకున్న ఈశాన్య రాష్ట్రాలు

ఈశాన్య రాష్ట్రాలను సైతం చలి వొణికిస్తుంది. సిక్కిం, డార్జీలింగ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో గత రెండు రోజులుగా విపరీతమైన మంచు కురుస్తుంది

Cold Wave in Northeast: మంచు దుప్పటి కప్పుకున్న ఈశాన్య రాష్ట్రాలు

Snow

Updated On : December 29, 2021 / 3:44 PM IST

Cold Wave in Northeast: ఉత్తర భారతాన్ని చలి గజగజా వొణికిస్తుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో “కోల్డ్ వేవ్” హెచ్చరికలు జారీచేశారు అధికారులు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, చలి నుంచి రక్షణ పొందే విధంగా జాగ్రత్త తీసుకోవాలని పలు ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ఈశాన్య రాష్ట్రాలను సైతం చలి వొణికిస్తుంది. సిక్కిం, డార్జీలింగ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో గత రెండు రోజులుగా విపరీతమైన మంచు కురుస్తుంది. సిక్కింలోని కొండ ప్రాంతాలు, వెస్ట్ బెంగాల్ లోని డార్జీలింగ్, ఇతర పర్యాటక ప్రాంతాలు పూర్తిగా మంచు దుప్పటి కప్పుకున్నాయి.

నాథు లా, గురుడోంగ్‌మార్, యుమ్‌తంగ్, సోమ్గో సరస్సు(Tsomgo lake) వంటి పర్యాటక ప్రాంతాల్లో అడుగున్నర మేర మంచు కురిసింది. దీంతో ఈప్రాంతాల్లో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. విపరీతంగా మంచు కురుస్తున్న నేపథ్యంలో స్థానికులెవరు బయటకు రావద్దంటూ ఆయా జిల్లాల్లోని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. భారీగా కురిసిన హిమపాతం కారణంగా సిక్కింలోని పలు ప్రాంతాల్లో రవాణా, విద్యుత్, సమాచార వ్యవస్థ స్తంభించింది.

Also Read: Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు

ఇక రెండు రోజులుగా కురుస్తున్న హిమపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. దీంతో డార్జీలింగ్ లోని అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం సందక్ఫు(Sandakphu)ను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇక్కడ భారీ హిమపాతం కురుస్తుంది. మంచును చూసిన పర్యాటకులు కేరింతలు కొడుతున్నారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కొండ ప్రాంతాల్లోని ఘాట్ రోడ్లలో వాహనాలు నిలిచి, పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. పర్యాటకులను నిలువరించలేని అధికారులు.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. మరో నాలుగు రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల్లో “కోల్డ్ వేవ్” ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

Also Read: Woman Fight: మాస్క్ పెట్టుకోమన్నందుకు పోలీసులతో మహిళ ఫైట్