Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు

భూమిని కాదని వేరే గ్రాహం మీదకు వెళ్లేవారు.. ఆకలికి తాళ్లలేక ఒకరినొకరు చంపుకు తినటం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు

Space Colony

Scientists Warning: భూమిని వదిలి మరొక గ్రహంపై నివాసం ఏర్పరుచుకోవాలని చూస్తున్న మనుషులకు శాస్త్రవేత్తలు విస్తుపోయే విషయాన్ని వెల్లడించారు. భూమిని కాదని వేరే గ్రాహం మీదకు వెళ్లేవారు.. ఆకలికి తాళ్లలేక ఒకరినొకరు చంపుకు తినటం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మార్స్, జూపిటర్ వంటి గ్రహాలపై, కాలనీలు ఏర్పటు చేసుకోవాలన్న మనుషుల కలలపై.. శాస్త్రవేత్తల తాజా నివేదికలు నీళ్లుచల్లాయి. metro.co.uk పత్రిక కధనం ప్రకారం.. సమీప భవిష్యత్తులో మనుషులు ఇతర గ్రహాలపై నివాసం ఏర్పాటు చేసుకోవడం ఖాయం, అయితే అది అనుకున్నంత ఈజీ కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటీవల జరిపిన అంతరిక్ష పరిశోధనల్లో.. జూపిటర్ చందమామ, క్యాలిస్టో.., శని గ్రహ చందమామ టైటాన్ పైనా మనుషులు జీవించేందుకు అనువైన వాతావరణం ఉన్నట్లు తేల్చారు. ఇక సంవత్సరాల వ్యవధిలోనే.. క్యాలిస్టో, టైటాన్ లపై మనుషులు కాలనీలు ఏర్పాటు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు.

Also Read: Woman Fight: మాస్క్ పెట్టుకోమన్నందుకు పోలీసులతో మహిళ ఫైట్

అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఆహారం సరఫరా. భూమి నుంచి సుదూర ప్రాంతంలో ఉన్న ఆయా గ్రహాలపై పంట పండించే అవకాశం లేదు. ఏదైనా వ్యాధులు సంక్రమించినా చికిత్సలు ఉండవు. ఈ రెండు గ్రహాలకు భూమి నుంచి సహాయం అందించాలంటే ఏళ్ళకేళ్ళకు సమయం పడుతుంది. దీంతో ఆకలికి తట్టుకోలేక మనుషులు ఒకరినొకరు చంపుకుతినే అవకాశం ఉందని బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ కు చెందిన ఆస్ట్రోబయాలజీ ప్రొఫెసర్ చార్లెస్ కాకెల్ వెల్లడించారు. అందుకు ఉదాహరణగా, కెప్టెన్‌ సర్‌ జాన్‌ ఫ్రాంక్లిన్‌ 19వ శతాబ్దంలో చేపట్టిన ” నార్త్-వెస్ట్ ప్యాసేజ్‌”ను వివరించారు. సర్ జాన్ ఫ్రాంక్లిన్ 19వ శతాబ్దంలో ఒక భారీ నౌకను వేసుకుని భూమిపై ఉత్తర ధృవాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. అయితే కొన్ని రోజులకు దారి తప్పి..మంచు ఖండంలో చిక్కుకుపోయారు. రోజులు గడుస్తుండగా.. ఉన్న ఆహార నిల్వలు అయిపోయి.. నౌకలోని వారు ఒకరినొకరు చంపుకు తిన్నారు. ఇక గ్రహాలపైకి వెళ్లే మనుషుల పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని ప్రొఫెసర్ చార్లెస్ కాకెల్ హెచ్చరించారు. అయితే మార్స్ గ్రహంపై ఇటువంటి పరిస్థితి ఉండకపోవచ్చని.. భూమికి దగ్గరగా ఉన్నందున.. మార్స్ గ్రహంపైకి త్వరగానే చేరుకుని పరిస్థితిని కొంత చక్కబెట్టుకునే అవకాశం ఉంటుందని చార్లెస్ కాకెల్ వెల్లడించారు. కాబట్టి క్యాలిస్టో, టైటాన్ ల కన్నా ముందు మనుషులు మార్స్ గ్రహంపైకి చేరుకోవాలని కాకెల్ అభిప్రాయపడ్డారు.

Also Read: Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ వద్దంటూ చెట్టెక్కి కూర్చున్న యువకుడు

అయితే దీనికి పరిష్కార మార్గంగా కాకెల్ పలు సూచనలు చేసారు. క్యాలిస్టో, టైటాన్ గ్రహాలపైకి వెళ్లే ముందు సాంకేతికతను ఉపయోగించి ఆయా గ్రహాలపై వాతావరణాన్ని విశ్లేషించాలని సూచిస్తున్నారు. అక్కడ పంటలు పండేలా అనువైన వాతావరణం సృష్టించాలని, అప్పుడు కూడా నేరుగా మనుషులు వెళ్లకుండా గడ్డితినే జంతువులను పంపించి పరీక్షించాలని కాకెల్ సూచించారు. తద్వారా జంతువులను రక్షించినట్లు ఉంటుంది.. మనుషులకు ఏకాంత భావన తప్పుతుందని అతని అభిప్రాయం. డాక్టర్ కేమెరూన్ స్మిత్ అనే శాస్త్రవేత్త తెలిపిన వివరాలు ప్రకారం.. మనుషులు ఆత్రంగా గ్రహాలపై నివాసాలు ఏర్పరుచుకుంటే.. ఆకలికి తట్టుకోవడం అసాధ్యమని, దంతో వారు ఒకరినొకరు చంపుకు తినడం ఖాయమని స్మిత్ పేర్కొన్నారు. మనుషులు వెళ్లడం కన్నా, ఆయా గ్రహాలపై ముందుగా వ్యవసాయం చేస్తే బాగుంటుందని స్మిత్ అభిప్రాయపడ్డారు. మరి శాస్త్రవేత్తలు చెప్పిన ఈ వివరాలు విన్నాక కూడా ఇతర గ్రహాలపైకి ఎవరైనా వెళ్లాలనుకుంటారా ?

Also read: Telangana High Court : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలి..హైకోర్టులో విచారణ