Telangana High Court : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలి..హైకోర్టులో విచారణ

నూతన సంవత్సర వేడుకలపై కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.. ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుని వేడుకలపై...

Telangana High Court : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలి..హైకోర్టులో విచారణ

Tg New Year

New Year Celebration Banned : తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ..ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు 2021, డిసెంబర్ 29వ తేదీ గురువారం విచారణ చేపట్టింది. ప్రస్తుతం కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు పెడుతున్నాయనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాకుండా..నూతన సంవత్సర వేడుకలపై కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Read More : Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..పెద్దపాదం దారి ఓపెన్

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవేమి పట్టించుకోవడం లేదని, ప్యాండమిక్, ఎపిడెమిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. ఒమిక్రాన్ ను కట్టడి చేయకుండా న్యూ ఇయర్ వేడుకలకు అనుమతినిచ్చిందని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 62 ఒమిక్రాన్ కేసులున్నాయని కోర్టుకు తెలిపారు. ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుని..వేడుకలపై ఆంక్షలు పెట్టే విధంగా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీనిపై తదుపరి విచారణ డిసెంబర్ 30వ తేదీ గురువారం విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.

Read More : AP Congress : ఏపీ కాంగ్రెస్‌కు త్వరలో నూతన సారధి

పాత సంవత్సరానికి వీడ్కోలు..కొత్త సంవత్సరానికి ఘనంగా వెలకమ్ చెప్పడానికి ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎంతో జోష్ గా..గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్న వీరి కలలను కరోనా, కొత్త ఒమిక్రాన్ నీళ్లు చల్లింది. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై పలు ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం…జనవరి 02వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది.

Read More : Kalicharan Maharaj : ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహారాజ్‌పై కేసు నమోదు

కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే…నిర్వహించుకొనే సమావేశాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేయాలని, ప్రతొక్కరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించలని..భౌతిక దూరం మెంటైన్ చేయాలని సూచించింది. అయితే…నూతన సంవత్సరం వస్తున్న క్రమంలో..డిసెంబర్ 31వ తేదీ మద్యం దుకాణాలు,. బార్లు, స్పెషల్ ఈవెంట్స్ కు ప్రత్యేక అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది. మద్యం షాపులు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, ఈవెంట్స్, టూరిజం హోటల్స్ కు రాత్రి 1 గంట వరకు విక్రయాలు జరుపుకోవడానికి అనుమతినివ్వడం జరుగుతుందని తెలిపింది. ఈ సందర్భంలో…గురువారం జరిగే హైకోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది.