AP Congress : ఏపీ కాంగ్రెస్‌కు త్వరలో నూతన సారథి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని   ఏఐసీసీ జనవరి నెలాఖరులోపు   ప్రకటించనుంది. కేంద్ర మాజీ మంత్రి, డా. చింతా మోహన్, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్.పి హర్

AP Congress : ఏపీ కాంగ్రెస్‌కు త్వరలో నూతన సారథి

Appcc New President

Updated On : December 29, 2021 / 2:24 PM IST

AP Congress president : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని   ఏఐసీసీ జనవరి నెలాఖరులోపు   ప్రకటించనుంది. కేంద్ర మాజీ మంత్రి, డా. చింతా మోహన్, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్.పి హర్షకుమార్, ఏఐసిసి సెక్రటరీ మస్తాన్ వలీ పేర్లను ఏఐసిసి ఇంచార్జ్‌ల బృందం పరిశీలిస్తోంది. మరో వైపు ఏపీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరిస్తూ నివేదిక సిధ్దం చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమన్ చాందీ.

సమర్ధుడు, విధేయుడు, సమన్వయంతో అందరినీ కలుపుకుని పోయే నాయకుడు కోసం అన్వేషణ చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. సంక్రాంతి పండుగ లోపు ఏపీ సీనియర్ నాయకులను ఉమన్ చాందీ మరోసారి  స్వయంగా  కలవనున్నారు. త్వరలో హైదరాబాద్ వచ్చే ఉమన్ చాందీ… మొదట మాజీ ముఖ్యమంత్రి కే.రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఏపీ నేతలతో సమావేశం అయి పార్టీ బలోపేతం…పీసీసీ అధ్యక్షుడి నియామకాలపై చర్చలు జరుపుతారు.
Also Read : TTD : టీటీడీ కేసు వాదించటానికి తిరుపతి వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి
అనంతరం విజయవాడ  వెళ్లి మరోసారి  రాష్ట్ర నేతలను కలిసి అంతిమంగా నివేదిక సిధ్ధం  చేస్తారు. సాధ్యమైనంత త్వరగా అభిప్రాయ సేకరణ  ప్రక్రియను పూర్తి చేసి… జనవరి నెలాఖరు కల్లా ఏపిపిసిసి నూతన అధ్యక్షుడు నియామకం పూర్తి చేయాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది.