Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..పెద్దపాదం దారి ఓపెన్

మరో వారంలో మండలం సీజన్‌ ముగుస్తుందనగా అటవీశాఖ అధికారులు ఈ దారిని తిరిగి తెరుస్తున్నట్టు ప్రకటించారు. కరిమల, వలియనవట్టం, చెరియనవట్టం, పంపా, మరకొట్టం, పెరూర్‌తోడు, కాలైకట్టి, అలుదా..

Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..పెద్దపాదం దారి ఓపెన్

Sabari

Sabarimala Temple Forest Path : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్‌ చెప్పింది ట్రావెన్‌ కోర్ దేవస్థానం బోర్డు… ప్రకృతితో మమేకమై నడుస్తూ స్వామివారి సన్నిధికి చేరుకునే పెద్దపాదం దారిని తెరవనున్నారు అధికారులు.. డిసెంబర్‌ 31 నుంచి ఈ రూట్‌ భక్తులకు అందుబాటులోకి రానుంది. దీనికోసం కావాల్సిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తైయినట్టు అధికారులు తెలిపారు. పెద్దపాదం మార్గంలో పాదయాత్ర చేస్తూ స్వామివారిని చేరుకోవాలంటే దట్టమైన అరణ్యంలో కొండల మధ్య కాలిబాటన ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇరుముడిని తలపై దాల్చి ఈ మార్గం గుండా ప్రయాణించాలనేది ప్రతి అయ్యప్ప భక్తుడి కోరిక. ఇప్పుడా కోరికకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది దేవస్థానం బోర్డు.

Read More : AP Congress : ఏపీ కాంగ్రెస్‌కు త్వరలో నూతన సారధి

మరో వారంలో మండలం సీజన్‌ ముగుస్తుందనగా అటవీశాఖ అధికారులు ఈ దారిని తిరిగి తెరుస్తున్నట్టు ప్రకటించారు. కరిమల, వలియనవట్టం, చెరియనవట్టం, పంపా, మరకొట్టం, పెరూర్‌తోడు, కాలైకట్టి, అలుదా నది మీదుగా సాగే ఈ యాత్ర రూట్‌ను 2021, డిసెంబర్ 30వ తేదీ గురువారం చివరిసారిగా మరోసారి తనిఖీలు చేయనున్నారు. ఇప్పటికే ఈ రూట్‌ను మొత్తం క్లియర్‌ చేసింది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌.

Read More : Film Industry : సినిమాలో కూడా వారసత్వం – డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

ఇది పెరియార్‌ టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏ ఒక్కరిని అనుమతించమని తెలిపారు. మరోవైపు అయ్యప్ప స్వాములకు మరో గుడ్ న్యూస్‌ చెప్పింది దేశస్థానం బోర్డు.. 2021, డిసెంబర్ 29వ తేదీ బుధవారం నుంచి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను రోజుకు 45 వేల నుంచి 60 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్టు తెలిపింది.