Kalicharan Maharaj : ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహారాజ్‌పై కేసు నమోదు

డిసెంబర్ 19న సమస్త్ హిందూ అఘాడి నిర్వహించిన కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై పుణె పోలీసులు ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహరాజ్‌పై కేసు నమోదు చేశారు.

Kalicharan Maharaj : ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహారాజ్‌పై కేసు నమోదు

Kalicharan Maharaj

Kalicharan Maharaj : డిసెంబర్ 19న సమస్త్ హిందూ అఘాడి నిర్వహించిన కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై పుణె పోలీసులు ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహరాజ్, మిలింద్ ఎక్బోటే, నందకిషోర్ ఎక్బోటేతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వార్తా సంస్థ ANI తెలిపింది.

చదవండి : Subramanian swamy : స్వామి సంచలన ట్వీట్.. యూపీలో రాష్ట్రపతి పాలన?

మహాత్మా గాంధీపై కించపరిచే పదాలను ఉపయోగించారని , జాతిపితను చంపినందుకు నాథూరామ్ గాడ్సేను అభినందిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు ఫిర్యాదు చేయడంతో కాళీచరణ్ మహారాజ్‌పై ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో పోలీస్ కేసులు నమోదయ్యాయి.

కేసుల నమోదుపై కాళీచరణ్ మహారాజ్ స్పందించారు. “గాంధీని కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు తనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కానీ దానికి నేను పశ్చాత్తాపపడను” అని కాళీచరణ్ మహరాజ్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో తెలిపారు.

చదవండి : Sri Varaha Swamy Temple : 624 రోజుల తర్వాత.. తిరుమల శ్రీ వరాహ స్వామి ఆలయంలో దర్శనాలు ప్రారంభం

కాగా రాయ్‌పూర్‌లోని రావణ్ భటా మైదానంలో జరిగిన ధరమ్ సన్సద్‌లో కాళీచరణ్ మహారాజ్ మాట్లాడుతూ, “రాజకీయాల ద్వారా దేశాన్ని స్వాధీనం చేసుకోవడమే ఓ వర్గం లక్ష్యం” అని కూడా ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై కూడా అతడిపై కేసు నమోదైంది. ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతనిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఒక అధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ PTI కి తెలిపింది.

చదవండి : Yadadri Lakshmi Narasimha Swamy : చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు