Sign On Bond Paper : ప్రియుడితో బాండ్ పేపర్ పై సంతకం చేయించుకున్న ప్రియురాలు

డేటింగ్ యాప్ లో మోసపోయిన యువతి.. మరోసారి ఆలా జరగకుండా ఉండేందుకు ఓ ప్లాన్ వేసింది. తనకు పరిచయమయ్యే యువకుడితో బాండ్ పై సంతకం చేయించుకోవాలనుకుంది.

Sign On Bond Paper : ప్రియుడితో బాండ్ పేపర్ పై సంతకం చేయించుకున్న ప్రియురాలు

Sign On Bond Paper

Sign On Bond Paper : నెట్టింట్లో డేటింగ్ యాప్స్ చాలానే ఉన్నాయి. ఈ యాప్స్ లో తమకు నచ్చిన వ్యక్తులను పరిచయం చేసుకొని వారితో డేటింగ్ చేస్తూ వారి అభిరుచులను తెలుసుకోవచ్చు. ఈ యాప్స్ ద్వారా కలుసుకున్న కొన్ని జంటలు పెళ్లివరకు వెళ్లాయి. మరికొందరు మాత్రం దారుణంగా మోసపోయారు. పరిచయం సమయంలో ఉన్నంత నమ్మకంగా తర్వాత ఉండకపోవడంతో చాలా జంటలు మధ్యలోనే విడిపోయాయి.

Read More : Social Media : ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌ని నమ్మి వెళితే అఘాయిత్యం చేసి.. అశ్లీల వీడియోలు తీశాడు

ఇటువంటి మోసాలు జరుగుతాయని ముందే గ్రహించిన ఓ యువతి ఏకంగా బాండ్‌పై సంతకం చేయించుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకి చెందిన యానీ రైట్ అనే యువతి గతంలో డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి చేతిలో మోసపోయింది. దీంతో ఆమె ఓ ఆలోచన చేసింది.. మోసం చేయకుండా ఉండాలంటే తనకు పరిచయమైన వ్యక్తితో బాండ్‌పై సంతకం చేయించుకుంటే ఓ పనైపోతుందని అనుకుంది. ఈ సమయంలోనే టిండర్‌ డేటింగ్ యాప్ లో మైక్‌ హెడ్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు.

ఇద్దరి మనసులు కలిశాయి. ఒకరినొకరు ఇష్టపడటంతో చెట్టాపట్టాలేసుకు తిరగొచ్చని అనుకున్నాడు యువకుడు.. ఈ తరుణంలోనే మైక్‌ హెడ్‌ కి షాక్ యానీ షాక్ ఇచ్చింది. 17 పేజీల బాండ్‌ తీసుకొచ్చి ప్రియుడి ముందు ఉంచింది.. మనం కలిసి తిరగాలంటే ఈ షరతులకు ఒప్పుకుంటున్నట్లుగా సంతకం చేయాలనీ కోరింది. మొదట కొద్దిగా సంకోసించిన మైక్‌ హెడ్‌ ఆ తర్వాత 17 పేజీల బాండ్‌పై సంతకం చేసి యానీకి బాయ్ ఫ్రెండ్ గా కొనసాగుతున్నారు.

Read More : Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు : మెగాస్టార్ చిరంజీవి

వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరువురు నిజాయితీని, ఒకరికొకరికి కావాల్సిన అవసరాలను తీర్చడంలో, ఇరువురు మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్‌ ఉండాలని ఒప్పందంలో ఉన్నాయి. కాగా ఈ జోడీ ఈ బంధాన్ని బిజినెస్‌ డీల్‌గానే చూస్తామనడం కొసమెరుపు.