Gold in Mouth: నోట్లో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్.. ఎలా దొరికిపోయాడంటే..!?

ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. నోట్లో దంతాలు ఉండే ప్రదేశంలో గోల్డ్ దాచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

Gold in Mouth: నోట్లో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్.. ఎలా దొరికిపోయాడంటే..!?

Illegal Gold

Updated On : September 11, 2021 / 1:57 PM IST

Gold in Mouth: ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. నోట్లో దంతాలు ఉండే ప్రదేశంలో గోల్డ్ దాచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ సెర్చింగ్ లో 951గ్రాముల గోల్డ్ తో పాటు మెటాలిక్ చైన్ ను కూడా రికవరీ చేసుకున్నారు.

కస్టమ్స్ ఏఐయూ ఆఫీసర్లు ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పంటి స్థానంలో దాచిన బంగారం, మెటాలిక్ చైన్ కలిపి ఓరల్ క్యావిటీలో 951గ్రాములు స్వాధీనపరచుకున్నారు. తర్వాతి విచారణను కొనసాగిస్తున్నారు.

వీరితో పాటు మస్కట్ నుంచి వస్తున్న ఒక ఇండియన్ ప్యాసింజర్ జేబులో అక్రమంగా తరలిస్తున్న గోల్డ్ ను రికవరీ చేశారు కస్టమ్స్ అధికారులు.

Sai Dharam Tej: యాక్సిడెంట్‌కు గురైన బైక్ విలువెంతో తెలుసా..

గత నెల 28వ తేదీ మస్కట్ నుంచి వస్తున్న వ్యక్తి బ్రౌన్ పేస్ట్ రూపంలో 1801గ్రాముల గోల్డ్ అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. అతనితో పాటుగా రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.