Srilanka Toddy : శ్రీలంక కొబ్బరి కల్లుకు విదేశాల్లో భలే గిరాకీ… ఆ టేస్టే వేరు గురూ..

లంకేయులు ఈ కొబ్బరి కల్లును డార్క్ రమ్ గా పిలుస్తారు. అక్కడి ప్రభుత్వానికి ఇదొక అదాయ వనరుగా మారటంతో ప్రభుత్వమే కల్లు తయారీని ప్రోత్సహిస్తుంది.

Srilanka Toddy : శ్రీలంక కొబ్బరి కల్లుకు విదేశాల్లో భలే గిరాకీ… ఆ టేస్టే వేరు గురూ..

Kallu

Srilanka Toddy : గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన వారిలో కల్లు గురించి తెలియని వారుండరు. అదొక రకమైన మత్తు పానియంగా కల్లును చాలా మంది తాగేందుకు ఇష్టపడతారు. అయితే మరికొంత మంది ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని సేవిస్తుంటారు. ప్రధానంగా తాటి చెట్లు, ఈత చెట్ల నుండి కల్లును తీస్తుంటారు. ఆరోగ్యానికి దివ్యౌషదమని ప్రచారం సాగటంతో కల్లు తాగేవారి సంఖ్య పెరిగింది. పట్టణవాసులు సైతం కల్లు పానియాన్ని సేవించేందుకు వారాంతాలలో పల్లెటూళ్ళలోని కల్లు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తుండటం ప్రస్తుతం అనేక చోట్ల మనం చూస్తూనే ఉన్నాం.

ఇంత వరకు బాగానే ఉన్నా తాటి, ఈత కల్లుతో పాటు ప్రస్తుతం కొబ్బరి కల్లు అందుబాటులోకి వచ్చేసింది. శ్రీలంక దేశంలో ప్రస్తుతం ఈ కొబ్బరి కల్లు ఫేమస్ గా మారింది. అక్కడ కొన్ని కంపెనీలు కొబ్బరి చెట్ల నుండి కల్లు తీసి వాటిని ఆకర్షణీయమైన సీసాల్లో ప్యాకింగ్ చేసి విక్రయాలు చేస్తున్నాయి. స్ధానికుల నుండి వీటికి మంచి ఆదరణ లభిస్తుంది. అంతేకాదు ప్రస్తుతం శ్రీలంకలో తయారవుతున్న కొబ్బరి కల్లు ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతౌతుంది.

లంకేయులు ఈ కొబ్బరి కల్లును డార్క్ రమ్ గా పిలుస్తారు. అక్కడి ప్రభుత్వానికి ఇదొక అదాయ వనరుగా మారటంతో ప్రభుత్వమే కల్లు తయారీని ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలోనే అనేక కంపెనీలు కొబ్బరి కల్లును తయారీకి ఉత్సాహం కనబరుస్తున్నాయి. సింగపూర్, జపాన్, బ్రిటన్ వంటి దేశాలలో కొబ్బరి కల్లును విరివిగా ఉపయోగిస్తున్నారు. కాక్ టైల్ లో ఉపయోగించే మత్తు పానీయంగా దీన్ని శ్రీలంక మార్కెటింగ్ చేస్తుండటంతో విదేశాలలో దీనికి మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి కల్లును తాగేందుకు విదేశీయులుసైతం బాగా ఇష్టపడుతున్నారు.

శ్రీలంకలోని నాలుగు కల్లు ఉత్పత్తి సంస్ధలు ప్రతి ఏటా 60 మిలియన్ లీటర్ల కల్లును ఉత్పత్తి చేస్తున్నాయి. చెట్టు నుండి కల్లు తీసిన తరువాత దాని రుచి తియ్యగా ఉంటుంది. 6గంటల తరువాత దాని రుచిలో తేడా వచ్చి ఉప్పదనం వస్తుంది. అలా అందులో ఆల్కాహాల్ శాతం పెరుగుతుంది. ఆతరువాత దానిని విస్కీ, బ్రాందీల తయారీలో అనుసరించే స్వేదన ప్రక్రియకు గురిచేస్తారు. అలా చేయగా వచ్చిన దానిని ఆకర్షణీయమైన బాటిల్స్ లో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. త్వరలో ఈ కల్లును భారతదేశంలోకి కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.