గూగుల్ మహా అద్భుతం : 10వేల ఏళ్ల వరకు ఇదే సూపర్ కంప్యూటర్ 

  • Published By: veegamteam ,Published On : October 23, 2019 / 02:22 PM IST
గూగుల్ మహా అద్భుతం : 10వేల ఏళ్ల వరకు ఇదే సూపర్ కంప్యూటర్ 

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో ఘనత సొంతం చేసుకుంది. క్వాంటమ్ సుప్రిమసీ(ఫాస్టెస్ట్ కంప్యూటర్) సాధించింది. గూగుల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఓ సైన్స్ మేగజైన్ లో వచ్చిన కథనంలో.. క్వాంటమ్ ఆధిపత్యాన్ని సాధించినట్లు గూగుల్ తెలిపింది. దీనికి సంబంధించి నెల రోజుల క్రితమే ఒక లీక్ వచ్చింది. అయితే ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయ్యింది. 

గూగుల్ ప్రకారం ఇది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్, పవర్ ఫుల్ కంప్యూటర్. 10వేల ఏళ్ల వరకు ఇదే సూపర్ కంప్యూటర్ కానుందని గూగుల్ తెలిపింది. ఇందులో 54 క్యూబిట్ సైకామోర్ ప్రాసెసర్ ఉంది. దీని ద్వారా కేవలం 200 సెకన్లలో క్యాలుకలేషన్ చేయొచ్చు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పవర్ ఫుల్ సూపర్ కంప్యూటర్ గా గుర్తింపు పొందింది. పలు ప్రయోగాలు చేసిన తర్వాత క్వాంటమ్ సుప్రిమసీ సాధించినట్టు గూగుల్ ప్రకటించింది.

ఆన్‌లైన్‌ లావాదేవీల భద్రతకు భంగం కలగకుండా చూడటం, వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయడం ఇప్పుడున్న కంప్యూటర్‌ టెక్నాలజీకి సాధ్యం కావడం లేదు. క్వాంటమ్ కంప్యూటింగ్‌ ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గణితశాస్త్రంలోని ఆల్గారిథమ్‌, భౌతికశాస్త్రంలోని పరమాణు సిద్ధాంతం, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లన్నీ కలిసిన టెక్నాలజీయే క్వాంటమ్ కంప్యూటింగ్‌.